వర్షిత హత్యాచారంపై జగన్ సీరియస్
చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్న జగన్.. వీలైనంత త్వరగా హంతకుడిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. అయితే రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా కురబలకోటలోని ఓ వివాహానికి తల్లిదండ్రులతో కలిసి హాజరైంది వర్షిత. కొద్దిసేపటి తరువాత ఆ చిన్నారి కనిపించకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు చుట్టుపక్కల […]
చిత్తూరు జిల్లాలో కలకలం రేపిన చిన్నారి వర్షిత హత్యాచారం ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్న జగన్.. వీలైనంత త్వరగా హంతకుడిని పట్టుకొని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.
అయితే రెండు రోజుల క్రితం చిత్తూరు జిల్లా కురబలకోటలోని ఓ వివాహానికి తల్లిదండ్రులతో కలిసి హాజరైంది వర్షిత. కొద్దిసేపటి తరువాత ఆ చిన్నారి కనిపించకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. అయినా లాభం లేకపోగా.. మరుసటి రోజు ఫంక్షన్ హాల్ వెనుక ఆమె విగతజీవిగా కనిపించింది. ఇక పోస్టుమార్టం నివేదికలో ఆమెను హత్యాచారం చేసినట్లు వెల్లడైంది.
ఇదిలా ఉంటే ఈ కేసుపై చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టిని పెట్టింది. సీసీ ఫుటీజీల ఆధారంగా నిందితుడి ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. అతడు కర్ణాటకకు చెందిన వాడిగా అనుమానిస్తున్న పోలీసులు.. స్పెషల్ టీమ్స్‌తో నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు వర్షిత తల్లిదండ్రులకు ఎవరితోనైనా పాత గొడవలు ఉన్నాయా..? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు.