సచివాలయ ఉద్యోగులకు స్ట్రిక్ట్ రూల్స్ .. బ్రేక్ చేస్తే..

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి మరో కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివిధ కేటగిరీలుగా ఉద్యోగుల విభజన, సర్వీసు రూల్స్‌ను ఖరారు చేస్తూ పురపాలిక శాఖ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం, ప్రమోషన్స్‌తో పాటుగా జీతాల చెల్లింపు, క్రమశిక్షణ చర్యలు వంటి పలు అంశాలను పురపాలిక శాఖ సర్వీస్ నిబంధనల్లో పొందుపరిచారు.అంతేకాకుండా వార్డు సచివాలయ ఉద్యోగులు జిల్లా యూనిట్‌గా పని చేస్తారని చెప్పుకొచ్చారు. మినిస్టీరియల్ […]

  • Updated On - 3:08 pm, Mon, 11 November 19
సచివాలయ ఉద్యోగులకు స్ట్రిక్ట్ రూల్స్ .. బ్రేక్ చేస్తే..

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వార్డు సచివాలయ వ్యవస్థకు సంబంధించి మరో కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. వివిధ కేటగిరీలుగా ఉద్యోగుల విభజన, సర్వీసు రూల్స్‌ను ఖరారు చేస్తూ పురపాలిక శాఖ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకం, ప్రమోషన్స్‌తో పాటుగా జీతాల చెల్లింపు, క్రమశిక్షణ చర్యలు వంటి పలు అంశాలను పురపాలిక శాఖ సర్వీస్ నిబంధనల్లో పొందుపరిచారు.అంతేకాకుండా వార్డు సచివాలయ ఉద్యోగులు జిల్లా యూనిట్‌గా పని చేస్తారని చెప్పుకొచ్చారు.

మినిస్టీరియల్ విభాగం 1వ కేటగిరిలో ఉన్న వార్డు పరిపాలన కార్యదర్శి, 2వ కేటగిరిలోని వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్ కార్యదర్శికి పురపాలిక శాఖ రీజనల్ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ అధారిటీగా వ్యవహరిస్తారు. అటు ప్రజారోగ్య విభగంలోని 1వ కేటగిరి కిందకు వార్డు పారిశుధ్య కార్యదర్శి.. గ్రేడ్2గా పర్యావరణ కార్యదర్శి పరిగణలోకి వస్తారు. వీరి ఇరువురికి పురపాలిక శాఖ రీజనల్ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ అథారిటీగా వ్యవహరిస్తారు. ఇలా ఇంజినీరింగ్ విభాగానికి ప్రజారోగ్య విభఙ్గమ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ అపాయింట్‌మెంట్ ఆధారిటీగా.. టౌన్ ప్లానింగ్ విభగానికి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ ఆధారిటీగా.. సంక్షేమం, అభివృద్ధి విభాగానికి పురపాలిక శాఖ రీజినల్ డైరెక్టర్ అపాయింట్‌మెంట్ ఆధారిటీగా వ్యవహరిస్తారు.

మరోవైపు ఏదైనా పంచాయతీని మున్సిపాలిటీ లేదా కొర్పొరేషన్‌లోకి విలీనం చేస్తే.. గ్రామ సచివాలయ ఉద్యోగులు దానికి సమ్మతిస్తే.. వారిని ఆ కార్పొరేషన్‌లోకి వార్డు సచివాలయ ఉద్యోగులుగా పరిగణలోకి తీసుకుంటారు లేదా.. మరో గ్రామ సచివాలయంలోకి వారిని నియమిస్తారు. అంతేకాకుండా వార్డు సచివాలయ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాలు ఇస్తారు.

ఇక ఈ ఉద్యోగుల సెలవులు, రుణాలు, అడ్వాన్సులన్నింటినీ కూడా మున్సిపల్ కమీషనర్ చూసుకుంటారు. అటు ఉద్యోగులు క్రమశిక్షణా రాహిత్యమైన చర్యలు చేస్తే.. వారిపై వేటు వేసే అధికారం కూడా కమీషనర్ చేతుల్లోనే ఉంది. ఉద్యోగి చేసిన తప్పిందాన్ని బట్టి ఆయన 6 నెలల నుంచి ఏడాది వరకు సస్పెండ్ చేయవచ్చు. ఇక వార్డు సచివాలయ ఉద్యోగులందరూ సీపీఎస్ పరిధిలోకి వస్తారు. కాగా, ఉద్యోగులు ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు.