కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్సీకి తక్కువ: లోకేష్‌పై ఏపీ మంత్రి విసుర్లు
నారా లోకేష్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్సీకి తక్కువ అని సెటైర్లు వేశారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. స్పీకర్‌కు లోకేష్ బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పిన ఆయన.. లోకేష్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. స్పీకర్ పదవిని దిగజార్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేని వెల్లంపల్లి ఘాటు కామెంట్లు చేశారు. సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొన్నా.. చర్యలు తీసుకోలేని పరిస్థితిలో గత స్పీకర్ ఉండేవారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు ఇరిగేషన్ […]
నారా లోకేష్ కార్పొరేటర్‌కు ఎక్కువ, ఎమ్మెల్సీకి తక్కువ అని సెటైర్లు వేశారు ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. స్పీకర్‌కు లోకేష్ బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని చెప్పిన ఆయన.. లోకేష్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. స్పీకర్ పదవిని దిగజార్చిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేని వెల్లంపల్లి ఘాటు కామెంట్లు చేశారు. సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొన్నా.. చర్యలు తీసుకోలేని పరిస్థితిలో గత స్పీకర్ ఉండేవారని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు ఇరిగేషన్ శాఖ మీద అవగాహన లేదని వెల్లంపల్లి దుయ్యబట్టారు. టీడీపీని కనుమరుగు చేయాలనుకుంటే జగన్‌కు ఒక్క నిమిషం పనేనని చెప్పిన వెల్లంపల్లి.. జగన్ విలువలతో కూడిన రాజకీయం చేసే గొప్ప నేత అని ప్రశంసించారు. జగన్ తలచుకుంటే లోకేష్‌తో అందరూ వైసీపీలోకి వస్తారని ఆయన వ్యాఖ్యానించారు.