గ్రేట్ కలాం చంద్రబాబు శిష్యుడట.. ఎందులోనో తెలుసా.?

పీవీ సింధును బ్యాడ్మింటన్ ఆడమన్నది నేనే.. ‘మైక్రోసాఫ్ట్’ సీఈఓ సత్య నాదెళ్లను ఇంజినీరింగ్ చేరమన్నది నేనే.. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది నేనే’.. ఇలా అన్నీ నేనే.. అన్నీ నేనే అంటూ పలు ఇంటరెస్టింగ్ కామెంట్స్‌ చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటుగా మారింది.  అవన్నీ జరిగాయో లేదో తెలియదు గానీ.. వాటన్నింటికి మూల విరాట్‌ను నేనే అంటూ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు బాబు. ఇక ఇప్పుడు తాజాగా ఆయన నోటి నుంచి మరో […]

గ్రేట్ కలాం చంద్రబాబు శిష్యుడట.. ఎందులోనో తెలుసా.?
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 09, 2019 | 4:00 PM

పీవీ సింధును బ్యాడ్మింటన్ ఆడమన్నది నేనే.. ‘మైక్రోసాఫ్ట్’ సీఈఓ సత్య నాదెళ్లను ఇంజినీరింగ్ చేరమన్నది నేనే.. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టింది నేనే’.. ఇలా అన్నీ నేనే.. అన్నీ నేనే అంటూ పలు ఇంటరెస్టింగ్ కామెంట్స్‌ చేయడం టీడీపీ అధినేత చంద్రబాబుకు అలవాటుగా మారింది.  అవన్నీ జరిగాయో లేదో తెలియదు గానీ.. వాటన్నింటికి మూల విరాట్‌ను నేనే అంటూ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు బాబు. ఇక ఇప్పుడు తాజాగా ఆయన నోటి నుంచి మరో క్రేజీ కామెంట్ బయటికి వచ్చింది.

ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాంపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు రూపొందించిన విజన్ 2020 గురించి తెలుసుకున్న కలాం.. ఆ తర్వాత విజన్‌పై పలు పుస్తకాలను రచించి.. ఏకంగా దేశ ఆర్ధిక విజన్‌పై ఓ బుక్ సైతం ఆవిష్కరించారని చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు ఈ కామెంట్ రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. మరోవైపు అగ్రిగోల్డ్ బాధితులకు తామే పరిహారం చెల్లించాలని అనుకున్నామని.. కానీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వల్ల అది జరగలేదన్నారు. ఇక ఇప్పుడు జగన్ ఆ పని పూర్తి చేశారన్నారు. అంతేకాకుండా తాను సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానని.. నెంబర్ 1 స్థానంలో నిలిపేందుకు చాలావరకు ప్రయత్నించానన్నారు.