రాష్ట్రం కోసం ఆ ఎమ్మెల్యే తన ఐదేళ్ల జీతం విరాళంగా…
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం తన జీతభత్యాన్ని మొత్తం ‘కనెక్ట్ టు ఆంధ్రా’కు ఇస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శికి లిఖిత పూర్వకంగా లేఖ అందజేశారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు తనవంతు సాయంగా.. తనకు వచ్చే జీతభత్యాలను మొత్తం ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రవాసాంధ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర దాతలు […]
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్రాభివృద్ధి కోసం తన జీతభత్యాన్ని మొత్తం ‘కనెక్ట్ టు ఆంధ్రా’కు ఇస్తున్నట్లు అసెంబ్లీ కార్యదర్శికి లిఖిత పూర్వకంగా లేఖ అందజేశారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు తనవంతు సాయంగా.. తనకు వచ్చే జీతభత్యాలను మొత్తం ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది.
ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రవాసాంధ్రులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర దాతలు భాగం కావడం కోసం ఏపీ సీఎం జగన్ ‘కనెక్ట్ టూ ఆంధ్రా’ వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. దీని ద్వారా తమ సొంత ఊళ్లలో అమలవుతున్న నవరత్నాలు, నాడు-నేడు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు సహాయం చేయవచ్చని జగన్ తెలిపారు. కనెక్ట్ టూ ఆంధ్రా ద్వారా వెయ్యి కోట్ల రూపాయలను సమీకరించాలని సీఎం భావిస్తున్నారు.