జగన్ కొత్త లుక్ అదుర్స్.. వావ్ అంటున్న నెటిజన్లు!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్దే ద్యేయంగా పక్కా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తూ.. రాజన్న బిడ్డగా పేరు తెచ్చుకున్నారు. విదేశీ పర్యటన చేసినప్పుడు మాత్రమే తన లుక్స్ మార్చుకునే జగన్.. రీసెంట్‌గా గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యి.. కొత్త లుక్‌తో అందరిని విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల గుంటూరు పరేడ్ గ్రౌండ్స్‌లో […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రాష్ట్ర అభివృద్దే ద్యేయంగా పక్కా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం రాత్రింబవళ్ళు శ్రమిస్తూ.. రాజన్న బిడ్డగా పేరు తెచ్చుకున్నారు. విదేశీ పర్యటన చేసినప్పుడు మాత్రమే తన లుక్స్ మార్చుకునే జగన్.. రీసెంట్‌గా గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యి.. కొత్త లుక్‌తో అందరిని విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఇటీవల గుంటూరు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన సీఎం.. వైద్య ఆరోగ్యశాఖ విద్యాశాఖ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన ఉచిత కళ్లజోళ్ల పంపిణీ స్టాల్స్‌ను సందర్శించారు. ఆ సమయంలో జిల్లా కలెక్టర్ ఓ కళ్లజోడును జగన్‌కు అందించగా.. అది తీసుకుని జగన్ పెట్టుకుని బావుందంటూ చిరునవ్వు నవ్వారు. అటు అగ్రీగోల్డ్ డిపాజిటర్ల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కూడా సీఎం హాజరయ్యి.. రూ.10 వేలలోపు డిపాజిటర్లకు చెక్కులు అందజేశారు.