AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైఎస్‌ జగన్‌తో హిందూ గ్రూప్‌ ఛైర్మన్‌ భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ‘ద హిందూ’ గ్రూపు ఛైర్మన్‌ ఎన్‌.రామ్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం ఆయన నివాసానికి వచ్చిన రామ్‌.. సీఎంగా ఎన్నికయినందుకు వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న అమ్మఒడి, రైతు భరోసా వంటి వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రణాళికను తెలిపారు. అమ్మఒడి పథకం తనను ఎంతో ఆకట్టుకుందని ఎన్‌.రామ్‌ ఈ […]

వైఎస్‌ జగన్‌తో హిందూ గ్రూప్‌ ఛైర్మన్‌ భేటీ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 24, 2019 | 12:24 AM

Share

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ‘ద హిందూ’ గ్రూపు ఛైర్మన్‌ ఎన్‌.రామ్‌ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళవారం ఆయన నివాసానికి వచ్చిన రామ్‌.. సీఎంగా ఎన్నికయినందుకు వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రం ప్రభుత్వం చేపడుతున్న అమ్మఒడి, రైతు భరోసా వంటి వివిధ సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి ఆయనకు వివరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రణాళికను తెలిపారు. అమ్మఒడి పథకం తనను ఎంతో ఆకట్టుకుందని ఎన్‌.రామ్‌ ఈ సందర్భంగా సీఎంతో అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో తనకున్న అనుబంధాన్ని రామ్‌ గుర్తుచేసుకున్నారు. అనంతరం వైఎస్‌ జగన్‌కు జ్ఞాపికను అందజేశారు.

Follow Us