AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నక్యాంటిన్ కాస్తా.. ఇక రాజన్న క్యాంటిన్

నిరు పేదలకు రూ. 5కే టిఫెన్, భోజనం అందించే అన్న క్యాంటిన్ పేరు పోయింది. కొత్తగా రాజన్న క్యాంటిన్ పేరు వచ్చింది. క్యాంటీన్ పేరే కాదు.. రూపూ మారుతోంది. కొత్త ప్రభుత్వం రావడంతో ఇప్పటికే సంక్షేమ పథకాల పేర్లన్నీ మారుతున్నాయి. అదే కోవలో అన్న క్యాంటీన్ కూడా చేరింది. గత టీడీపీ ప్రభత్వం రూ. 5లకే భోజనం అందించేందుకు చేపట్టిన అన్న క్యాంటిన్ పథకానికి వైసీపీ ప్రభుత్వం పేరు మార్చింది. ఇక నుంచి అన్న క్యాంటిన్లు రాజన్న […]

అన్నక్యాంటిన్ కాస్తా.. ఇక రాజన్న క్యాంటిన్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 24, 2019 | 8:04 AM

Share

నిరు పేదలకు రూ. 5కే టిఫెన్, భోజనం అందించే అన్న క్యాంటిన్ పేరు పోయింది. కొత్తగా రాజన్న క్యాంటిన్ పేరు వచ్చింది. క్యాంటీన్ పేరే కాదు.. రూపూ మారుతోంది. కొత్త ప్రభుత్వం రావడంతో ఇప్పటికే సంక్షేమ పథకాల పేర్లన్నీ మారుతున్నాయి. అదే కోవలో అన్న క్యాంటీన్ కూడా చేరింది. గత టీడీపీ ప్రభత్వం రూ. 5లకే భోజనం అందించేందుకు చేపట్టిన అన్న క్యాంటిన్ పథకానికి వైసీపీ ప్రభుత్వం పేరు మార్చింది. ఇక నుంచి అన్న క్యాంటిన్లు రాజన్న క్యాంటిన్లయ్యాయి. ఇలా కర్నూలు జిల్లాలో ఉన్న 12 క్యాంటిన్‌లకు పేరు మారిపోయింది. క్యాంటిన్‌కు వైట్‌ పేయింట్‌ వేసి… వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నిలువెత్తు ఫొటోలతో పాటు రాజన్న క్యాంటిన్‌ అన్న పేరు రాయించారు. ఫ్లెక్సీ కట్‌ఔట్స్‌ను ఏర్పాటు చేశారు.

Follow Us