జగన్‌పై హత్యాయత్నం కేసు: శ్రీనివాస్‌కు బెయిల్ రద్దు
గతేడాది జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. జగన్‌పై దాడి కేసులో ఇవాళ ఎన్‌ఐఏ తుది చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వడం వల్ల కేసుని తప్పుదోవ పట్టిస్తున్నాడని, సాక్ష్యులని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించిన ఎన్ఐఏ.. అతడికి బెయిల్ రద్దు చేయాలంటూ పేర్కొంది. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్ట్.. ఆయనకు బెయిల్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే నిందితుడు శ్రీనివాస్ పోలీసుల […]

గతేడాది జగన్‌పై కోడి కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు హైకోర్టు బెయిల్ రద్దు చేసింది. జగన్‌పై దాడి కేసులో ఇవాళ ఎన్‌ఐఏ తుది చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వడం వల్ల కేసుని తప్పుదోవ పట్టిస్తున్నాడని, సాక్ష్యులని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించిన ఎన్ఐఏ.. అతడికి బెయిల్ రద్దు చేయాలంటూ పేర్కొంది. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్ట్.. ఆయనకు బెయిల్‌ను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే నిందితుడు శ్రీనివాస్ పోలీసుల ఎదుట లొంగిపోవాల్సి ఉంటుందని పేర్కొంది.
కాగా గతేడాది జగన్‌పై దాడి చేసిన కేసులో ఈ ఏడాది మే 22న శ్రీనివాస్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మే 25న అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. తాజాగా బెయిల్‌ను రద్దు చేసిన హైకోర్టు.. దీనిపై నిందితుడు అప్పీల్‌కు వెళ్ళొచ్చని సూచించింది.



