కాయ్ రాజా కాయ్..మంగళగిరి కా షేర్ కౌన్ హై

ఏపీలో ఎన్నికల నగారా మోగిన తర్వాత.. పార్టీలు తమ అభ్యర్థలను ప్రకటించాక రాజకీయం రసవత్తరంగా మారింది. అన్ని చోట్లా పక్కన బెడితే..ముఖ్యంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి పడింది. ఇందుకు కారణం ఏపీ సిఎం తనయుడు, మంత్రి లోకేష్ ఇక్కడి నుంచి పోటీకి దిగడమే. గతంలో లోకేష్ ఎమ్మెల్సీ ద్వాారా మినిస్టర్ అయ్యారు. దాంతో ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అందుకే  ఆయన తాజాగా ప్రత్యక్ష ఎన్నికల్లో తాడో, పేడో తేల్చుకోవాలని […]

కాయ్ రాజా కాయ్..మంగళగిరి కా షేర్ కౌన్ హై
Follow us
Ram Naramaneni

|

Updated on: May 04, 2019 | 12:29 PM

ఏపీలో ఎన్నికల నగారా మోగిన తర్వాత.. పార్టీలు తమ అభ్యర్థలను ప్రకటించాక రాజకీయం రసవత్తరంగా మారింది. అన్ని చోట్లా పక్కన బెడితే..ముఖ్యంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి పడింది. ఇందుకు కారణం ఏపీ సిఎం తనయుడు, మంత్రి లోకేష్ ఇక్కడి నుంచి పోటీకి దిగడమే. గతంలో లోకేష్ ఎమ్మెల్సీ ద్వాారా మినిస్టర్ అయ్యారు. దాంతో ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. అందుకే  ఆయన తాజాగా ప్రత్యక్ష ఎన్నికల్లో తాడో, పేడో తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే ఎలక్షన్స్ సమయంలో ఇక్కడ భారీ ప్రలోబాలు జరిగాయన్నది ఇన్‌సైడ్ టాక్.

ఎలక్షన్స్ తర్వాత కూడా ఈ సీటుపై హీటు తగ్గలేదు. బెట్టింగ్ రాయుళ్లు లోకేష్ సీటుపై విపరీతంగా పందేలు వేస్తున్నారు. లోకేష్ గెలుపుతో పాటు, మెజార్టీపై కూడా ఇక్కడ భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ స్థానం నుంచి  వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న  ఆళ్ల రామకృష్ణకే ఆ పార్టీ మళ్లీ సీటు ఇచ్చింది. అతనికి కూడా పర్సనల్‌గా మంచి ఇమేజ్ ఉండటంతో వైసీపీ తరుపున వాళ్లు కూడా అస్సలు తగ్గట్లేదు.

ఈ క్రమంలో మంగళగిరిలో ఎన్నికల బెట్టింగ్ నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.10.15లక్షలు, కారు, 7 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల బెట్టింగ్ జరుగుతున్నట్లు ఫోన్ రావడంతో రైడ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.