నేటి అసెంబ్లీలో చర్చించనున్న అంశాలు ఇవే..!
ప్రతిపక్షం, అధికారపక్షాల వాదనలతో వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు పన్నెండో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 9 గంటలకు స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు రుణమాఫీ బకాయిలు, చెల్లింపులపై చర్చించనున్నారు. అలాగే బందరు పోర్టుకు భూ సేకరణ, వ్యయం.. విశాఖలో తాగునీటి సమస్య పరిష్కారం పై సమగ్రంగా చర్చ జరుపనున్నారు. రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయా.. ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో నిధుల […]
ప్రతిపక్షం, అధికారపక్షాల వాదనలతో వాడీవేడీగా మొదలైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు పన్నెండో రోజుకు చేరుకున్నాయి. ఉదయం 9 గంటలకు స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రైతు రుణమాఫీ బకాయిలు, చెల్లింపులపై చర్చించనున్నారు. అలాగే బందరు పోర్టుకు భూ సేకరణ, వ్యయం.. విశాఖలో తాగునీటి సమస్య పరిష్కారం పై సమగ్రంగా చర్చ జరుపనున్నారు. రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయా.. ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఎన్టీఆర్ వైద్య సేవా పథకంలో నిధుల దుర్వినియోగం, అలాగే ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు పరిహారం వంటి అంశాలు చర్చకు రానున్నాయి. ఇక రైతు ఆత్మహత్య నివారణ పై సభలో చర్చించనున్నారు.