నేటి నుండి ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్!
ఎట్టకేలకు ఏపీ ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించింది. రేపటి నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించింది. 1 నుంచి 35వేల ర్యాంకు వరకు ఈనెల 27, 28న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 35,001 నుంచి 80 వేల వరకు ఈ నెల 29, 30తేదీల్లో.. 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జులై 31, ఆగస్టు 1న వెబ్ ఆప్షన్లు ఎంచుకోనేందుకు అవకాశం […]
ఎట్టకేలకు ఏపీ ఉన్నత విద్యామండలి ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ మేరకు కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించింది. రేపటి నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం కల్పించింది. 1 నుంచి 35వేల ర్యాంకు వరకు ఈనెల 27, 28న వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 35,001 నుంచి 80 వేల వరకు ఈ నెల 29, 30తేదీల్లో.. 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జులై 31, ఆగస్టు 1న వెబ్ ఆప్షన్లు ఎంచుకోనేందుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 2న వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కల్పించారు. అనంతరం ఆగస్టు 4న విద్యార్థులకు కేటాయించిన సీట్ల వివరాలను సంబంధిత వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు.
ఆగస్ట్ 5 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. కళాశాలల్లో విద్యార్థులు రిపోర్టు చేసేందుకు చివరి తేదీ ఆగస్టు 8గా ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇన్ని రోజులూ కళాశాల రుసుముల విషయంలో ఎటూ తేల్చకపోవడం వల్ల కౌన్సెలింగ్ ప్రక్రియలో ఈ జాప్యం జరిగింది. విద్యార్థుల భవిష్యత్తు, కళాశాల యాజమాన్యాల వినతుల దృష్ట్యా గతేడాది రుసుములనే ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.