Endowment officials: అమరావతికి చేరిన విశాఖ ఎండోమెంట్ అధికారుల వివాదం.. వెలుగులోకి అవినీతి, అకృత్యాలు

నిన్నటి విశాఖ ఎండోమెంట్ అధికారుల వివాదం ఇవాళ అమరావతికి చేరింది. ఇద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో, దేవాదాయ అధికారుల పంచాయితీపై

Endowment officials: అమరావతికి చేరిన  విశాఖ ఎండోమెంట్ అధికారుల వివాదం.. వెలుగులోకి అవినీతి, అకృత్యాలు
Endowment Officials
Follow us
Venkata Narayana

|

Updated on: Aug 06, 2021 | 12:20 PM

Endowment officials: నిన్నటి విశాఖ ఎండోమెంట్ అధికారుల వివాదం ఇవాళ అమరావతికి చేరింది. ఇద్దరూ పరస్పరం ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దాంతో, దేవాదాయ అధికారుల పంచాయితీపై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. అసలు, వివాదానికి కారణమేంటనే కోణంలో ఆరా తీస్తున్నారు. నిజంగానే లైంగిక వేధింపులా? లేక ఆధిప్యత పోరా? ఇంకేదైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

అయితే, తనపై దాడి వెనుక అసిస్టెంట్ కమిషనర్ శాంతి అవినీతే కారణమంటున్నారు డిప్యూటీ కమిషనర్. జ్ఞానాపురం ఎర్నిమాంబ దేవాలయ ఈవో శ్రీనివాసరాజు.. హుండీ లెక్కింపులో అవకతవకలకు పాల్పడటంతో సస్పెండ్ చేశామన్నారు. అంతేకాదు,  సదరు శ్రీనివాసరాజు.. అసిస్టెంట్ కమిషనర్ శాంతికి అత్యంత సన్నిహితుడని డీసీ అంటున్నారు. అందుకే, అనకాపల్లి దేవాలయంలో బాధ్యతలు నిర్వర్తిస్తోన్న శ్రీనివాసరాజుకు అదనంగా అనేక బాధ్యతలు అప్పగిస్తూ అతనిచేత అవినీతి చేస్తూ వాటాలు పంచుకుంటున్నారనేది డిప్యూటీ కమిషనర్ ఆరోపిస్తున్నారు. వీళ్ల అవినీతిని అడ్డుకున్నందుకే అసిస్టెంట్ కమిషనర్ శాంతి తనపై దాడి చేసిందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు డీసీ. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా అందజేశారు.

డీసీ ఆరోపణలు ఇలాగుంటే, అసిస్టెంట్ కమిషనర్ శాంతి వాదన మరోలా ఉంది. శ్రీనివాసరాజు సమర్ధవంతంగా పని చేయడం వల్లే తాను ప్రోత్సహించానని.. ఇది తప్పెలా అవుతుందని అంటున్నారు. శ్రీనివాసరాజుతో తనకు లేనిపోని సంబంధాలు అంటగట్టి డిప్యూటీ కమిషనర్ ప్రచారం చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని.. కానీ, ఇలా సంబంధాలు అంటగడితే ఎలాగంటూ అసిస్టెంట్ కమిషనర్ శాంతి రోదిస్తోంది. డీసీ తప్పుడు ప్రచారంతో.. పెళ్లైన తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కన్నీళ్లు పెట్టుకుంటోంది.

అవినీతిని అడ్డుకున్నాననే కోపం, ఈవో శ్రీనివాసరాజు సస్పెన్షన్ ను జీర్జించుకోలేకే ఏసీ శాంతి తనపై దాడి చేసిందనే డిప్యూటీ కమిషనర్ వాదన. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకే ఇసుక పోశాననేది అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఆవేదన. మరి, వీళ్లద్దరి ఫిర్యాదులపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్నది చూడాలి. అయితే, ఏసీ, డీసీ చర్యలతో దేవాదాయ ప్రతిష్ట రోడ్డున పడిందని భక్తులు అంటున్నారు. పవిత్రమైన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇలా బజారున పడటం సరికాదంటున్నారు.

Read also: Officers Fight: విశాఖ దేవాదాయశాఖ అధికారుల మధ్య కొట్లాట, ఆఫీస్‌లో డిప్యూటీ కమిషనర్‌పై ఇసుక, మట్టి విసిరిన అసిస్టెంట్ కమిషనర్ శాంతి

Medak Children: మెదక్ జిల్లాలో అబ్బురపరుస్తోన్న బస్తీలోని చిన్న పిల్లల ప్రయత్నం.. యావత్ ప్రపంచానికే ఆదర్శం

భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
రిటైర్మెంట్‌తో షాకిచ్చిన టీమిండియా ప్లేయర్