అసెంబ్లీలో చంద్రబాబుకు జగన్ సవాల్!

ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 2014 నుంచి రైతులకు సున్నా వడ్డీ పథకం అమలు చేశామంటూ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. దీనికి సీఎం జగన్ స్పందించారు. 2014 నుంచి 2019 వరకు సున్నా వడ్డీ పథకం కింద ఎంత ఇచ్చారో చెప్పాలని చంద్రబాబుకు సీఎం జగన్‌ సవాల్‌ విసిరారు. రికార్డులు తెప్పిస్తా చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని జగన్ డిమాండ్ చేశారు. కాగా… విత్తనాలు ఇవ్వలేని పరిస్థితిలో […]

అసెంబ్లీలో చంద్రబాబుకు జగన్ సవాల్!
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2019 | 3:52 PM

ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 2014 నుంచి రైతులకు సున్నా వడ్డీ పథకం అమలు చేశామంటూ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అన్నారు. దీనికి సీఎం జగన్ స్పందించారు. 2014 నుంచి 2019 వరకు సున్నా వడ్డీ పథకం కింద ఎంత ఇచ్చారో చెప్పాలని చంద్రబాబుకు సీఎం జగన్‌ సవాల్‌ విసిరారు. రికార్డులు తెప్పిస్తా చంద్రబాబు రాజీనామా చేస్తారా? అని జగన్ డిమాండ్ చేశారు. కాగా… విత్తనాలు ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విత్తనాలు కూడా ఇవ్వలేని మీరు ఐదేళ్లలో ఏం చేస్తారు? అని అడిగారు. జీడీపీ లెక్కలు ఆర్థికమంత్రి, తాను రాసేవి కావన్నారు. ఆ విషయం తెలియకుంటే ఇంట్లో కూర్చుని లెక్కలు రాసుకోండని వ్యాఖ్యానించారు. మా హయాంలో వ్యవసాయ రంగంలో ఏపీ దేశంలోనే నెంబర్‌ వన్‌‌గా ఉందంటూ చంద్రబాబు స్పష్టంచేశారు.

Latest Articles