వి ఆర్ రెడీ టు హెల్ప్ యూ..నవీన్ పట్నాయక్‌కు బాబు ఫోన్
అమరావతి: ‘ఫొని ‘తుఫాన్ తీవ్రరూపం దాల్చబోతుంది. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తుపానుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తలు, లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు చర్యలు, వారికి ప్రత్యామ్నాయ సౌకర్యాల ఏర్పాట్లు తదితర అంశాలపై కలెక్టర్లతో సీఎం అత్యవసర సమీక్ష జరిపారు. తుపాను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒడిశాలోని పూరీని తాకవచ్చని అధికారులు ఇచ్చిన అంచనాలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చంద్రబాబు ఫోన్‌లో చర్చించారు. […]
అమరావతి: ‘ఫొని ‘తుఫాన్ తీవ్రరూపం దాల్చబోతుంది. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తుపానుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తలు, లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు చర్యలు, వారికి ప్రత్యామ్నాయ సౌకర్యాల ఏర్పాట్లు తదితర అంశాలపై కలెక్టర్లతో సీఎం అత్యవసర సమీక్ష జరిపారు. తుపాను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఒడిశాలోని పూరీని తాకవచ్చని అధికారులు ఇచ్చిన అంచనాలపై ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో చంద్రబాబు ఫోన్‌లో చర్చించారు. ఒడిశా ప్రభుత్వానికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇలాంటి కష్టకాలంలోనే ఇరుగు పొరుగు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని 15 మండలాలు, 200 గ్రామాలపై ‘ఫొని’ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండొచ్చని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఆయా ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చెయ్యాలని సీఎం ఆదేశించారు. 120 క్యాంపులను నిర్వహిస్తున్నామని, ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకంగా సహాయ, ముందస్తు కార్యక్రమాల అమలు పర్యవేక్షణ కోసం నియమించామని తెలిపారు. టెక్కలి, పలాస కేంద్రాలుగా సూపర్ సైక్లోన్ బృందాలు పనిచేస్తున్నట్టు అధికారులు చంద్రబాబుకు వివరించారు.