అధికారం ఉందని విర్రవీగడం కరెక్ట్ కాదు: చంద్రబాబు

అధికారం ఉందని విర్రవీగడం కరెక్ట్ కాదని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. ప్రాజెక్ట్‌లపై తాము ఏమీ చేయలేదని చెప్పడం సరికాదని తెలిపారు. బాబ్లీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా పోరాడామని చెప్పుకొచ్చారు. నీటి పంపకాలు సున్నితమైన అంశమని.. నీటి సమస్యలపై మేం గతంలో పోరాడామని వెల్లడించారు. జగన్ వయసు.. నా రాజకీయ అనుభవంతనన్న చంద్రబాబు భావితరాల భవిష్యత్‌ను తాకట్టుపెట్టే అధికారం మీకు లేదంటూ ఫైర్ అయ్యారు. 5 […]

అధికారం ఉందని విర్రవీగడం కరెక్ట్ కాదు: చంద్రబాబు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Jul 11, 2019 | 1:07 PM

అధికారం ఉందని విర్రవీగడం కరెక్ట్ కాదని ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన ఆయన.. ప్రాజెక్ట్‌లపై తాము ఏమీ చేయలేదని చెప్పడం సరికాదని తెలిపారు. బాబ్లీ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా పోరాడామని చెప్పుకొచ్చారు. నీటి పంపకాలు సున్నితమైన అంశమని.. నీటి సమస్యలపై మేం గతంలో పోరాడామని వెల్లడించారు. జగన్ వయసు.. నా రాజకీయ అనుభవంతనన్న చంద్రబాబు భావితరాల భవిష్యత్‌ను తాకట్టుపెట్టే అధికారం మీకు లేదంటూ ఫైర్ అయ్యారు. 5 కోట్ల మంది మీ నిర్ణయాలను చూస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వస్తే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు.. భారత్, పాక్‌లా తయారవుతాయని గతంలో అన్న జగన్.. ఆ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఎలా వెళ్లారంటూ ప్రశ్నించారు.