AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sajjala : ఉద్యోగాల కల్పనపై చంద్రబాబును ఎప్పుడైనా నిలదీశారా? : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

చంద్రబాబు హయాంలో 34 వేల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇచ్చారు. ఏ మోహం పెట్టుకొని ఆరోపణలు చేస్తున్నారు..? వీరికి సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద ఉన్నాయా? ఏనాడైనా చంద్రబాబును ఉద్యోగాల మీద ప్రశ్నించారా..?

Sajjala : ఉద్యోగాల కల్పనపై చంద్రబాబును ఎప్పుడైనా నిలదీశారా? : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala
Venkata Narayana
|

Updated on: Jun 28, 2021 | 11:17 PM

Share

Sajjala Hot comments : వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఓ వర్గం మీడియా అదే పనిగా విషం కక్కడం, వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వంపై దాడి చేయడం చేస్తున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. శూన్యం నుంచి లేనిది సృష్టించి ప్రజలను భ్రమలో ఉంచి మభ్యపెట్టాలని కుట్రలు చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ, హామీ నెరవేరదేమీ? అంటూ వార్తలు రాస్తున్నారని.. సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్లుగా విద్యరంగంలో చేస్తున్న విప్లవాత్మక మార్పులు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని సజ్జల చెప్పుకొచ్చారు.

“మా ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు అవుతుంది. ఈ సమయంలో ప్రయారిటీ ప్రకారం సీఎం వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారు. అత్యంత ప్రాధాన్యంగా విద్య, వైద్య రంగాన్ని తీసుకున్నారు. అని సజ్జల వివరించారు. ఈ రెండేళ్లలో సీఎం జగన్ 1.83,470 రెగ్యులర్‌ ఉద్యోగాలు కల్పించారని. ఇందులో 51,960 ఆర్టీసీ ఉద్యోగాలు అని సజ్జల అన్నారు.

2014–2019లో చంద్రబాబు ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారన్న సజ్జల.. 9,081 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చిన చంద్రబాబు 8, 031 ఉద్యోగాలు భర్తీ చేశారు. ఇది చంద్రబాబు చేసిన ఘనకార్యం అని సజ్జల అన్నారు. చంద్రబాబు హయాంలో 34 వేల ఉద్యోగాలు ఐదేళ్లలో ఇచ్చారు. ఏ మోహం పెట్టుకొని ఆరోపణలు చేస్తున్నారు..? వీరికి సిగ్గు, ఎగ్గు, మానం, మర్యాద ఉన్నాయా? ఏనాడైనా చంద్రబాబును ఉద్యోగాల మీద ప్రశ్నించారా..? అంటూ సజ్జల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఒక్క స్కూల్‌ మూతపడదు..ఒక్క ఉద్యోగం కూడా పోదని సజ్జల చెప్పారు. ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల శాతం భారీగా పెరిగిందని.. నాడు–నేడు కింద విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని సజ్జల పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీపై ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తున్నామని తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Read also : C Ramachandraiah : టీఆర్ఎస్ నేతలు అందుకే.. వైయస్‌ రాజశేఖరరెడ్డి మీద కామెంట్లు చేస్తున్నారు : ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య