చెప్పింది చేస్తున్న సీఎం..డ్వాక్రా మహిళల రుణమాఫీ

ఏపీ సీఎం జగన్ పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతోన్నారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ 2024లో అధికారమే టార్గెట్‌గా వడివడిగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందింది. ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్ఆర్ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నారు. డ్వాక్రా […]

చెప్పింది చేస్తున్న సీఎం..డ్వాక్రా మహిళల రుణమాఫీ
Follow us

|

Updated on: Jun 16, 2019 | 3:36 PM

ఏపీ సీఎం జగన్ పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగుతోన్నారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ 2024లో అధికారమే టార్గెట్‌గా వడివడిగా అడుగులు వేస్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అందింది. ఎన్నికలకు ముందు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు పథకాల్లో భాగంగా ‘వైఎస్ఆర్ ఆసరా’ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయనున్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసేందుకు తాజాగా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2019 ఏప్రిల్ 11వ తేదీకి ముందు తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొత్తం రూ.840 కోట్ల డ్వాక్రా రుణాలను మాఫీ చేయనున్నారు. నాలుగు విడతల్లో ఈ రుణమాఫీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. కానీ, రుణం పొందిన మహిళలు తమ బకాయిని చెల్లిస్తూ ఉండాలి. ఆ తర్వాత రోజుల్లో ప్రభుత్వం నుంచి మాఫీ అయిన నగదు మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. మండలాలు, పట్టణాల్లో సంబంధిత అధికారులు బ్యాంకుల ద్వారా అర్హులైన లబ్ధిదారులను ముందుగా గుర్తిస్తారు. అనంతరం 2019, ఏప్రిల్‌ 11 నాటికి అప్పు తీసుకున్న డ్వాక్రా సభ్యులకు ఆ మొత్తాన్ని బ్యాంకులో జమచేస్తారు.