5

జగన్‌ కీలక కేబినెట్ భేటి.. ఆర్టీసీ విలీనంపై ప్రకటన..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ మంత్రులతో కేబినెట్ భేటి నిర్వహించనున్నారు. ఉదయం 10.30గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటిలో పలు కీలక అంశాలపై ఆయన చర్చించనున్నారు. ఇక ఈ భేటీ తరువాత ఆర్టీసీ విలీనంపై జగన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇక అధికారం చేపట్టాక దీనిపై ప్రకటన ఇచ్చిన జగన్.. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి […]

జగన్‌ కీలక కేబినెట్ భేటి.. ఆర్టీసీ విలీనంపై ప్రకటన..!
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 9:09 AM

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ మంత్రులతో కేబినెట్ భేటి నిర్వహించనున్నారు. ఉదయం 10.30గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటిలో పలు కీలక అంశాలపై ఆయన చర్చించనున్నారు. ఇక ఈ భేటీ తరువాత ఆర్టీసీ విలీనంపై జగన్ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇక అధికారం చేపట్టాక దీనిపై ప్రకటన ఇచ్చిన జగన్.. రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 90 రోజుల పాటు అధ్యయనం చేసి.. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సమర్పించింది. ఈ నివేదికపై ముఖ్యమంత్రి.. నిపుణుల కమిటీలోని సభ్యులతో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పేర్ని నాని, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులందరూ ఈ శాఖ కిందకే రానున్నారు. మరో వైపు ప్రస్తుతం ఉన్న ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. బస్సు చార్జీలు ఫెయిర్‌గా ఉండేలా ట్రాన్స్‌పోర్ట్‌ రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా సీఎం సూచించినట్లు సమాచారం. అలాగే దశల వారీగా ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకువచ్చేలా జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇక ఈ నిర్ణయాలను బుధవారం మంత్రివర్గం ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

కాగా ఆర్టీసీ విలీనం అన్నది ఆ సంస్థ ఉద్యోగుల దశాబ్దాల కల. వీరిని రాష్ట్ర ప్రభుత్వంలోకి తీసుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే 52 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. మరోవైపు ఆర్టీసీ విలీనం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.3,300 కోట్ల నుంచి రూ.3,500 కోట్ల వరకు భారం పడుతుందని.. ఈ భారాన్ని భరించేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మంగళవారం తెలిపారు.

పెడన పవన్ వారాహి యాత్రలో తారక్ అభినుల సందడి..
పెడన పవన్ వారాహి యాత్రలో తారక్ అభినుల సందడి..
ఈ స్టార్‌ సెలబ్రిటీల పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు..
ఈ స్టార్‌ సెలబ్రిటీల పెళ్లి ఖర్చు చూస్తే కళ్లు తేలేస్తారు..
స్పందించకపోతే ఏంటి..? ఐ డోంట్ కేర్.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..
స్పందించకపోతే ఏంటి..? ఐ డోంట్ కేర్.. బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు..
వస్తే చేయడానికి అభ్యంతరం ఏముంది.? తాప్సీ
వస్తే చేయడానికి అభ్యంతరం ఏముంది.? తాప్సీ
తెలంగాణలో విష జ్వరాలు విజృంభణ.. పడకేస్తున్న ఏజెన్సీలోని పల్లెలు
తెలంగాణలో విష జ్వరాలు విజృంభణ.. పడకేస్తున్న ఏజెన్సీలోని పల్లెలు
చిక్కుల్లో బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌.. రణ్‌బీర్‌కు ఈడీ సమన్లు
చిక్కుల్లో బాలీవుడ్ చాక్లెట్‌ బాయ్‌.. రణ్‌బీర్‌కు ఈడీ సమన్లు
కోహ్లీ, అనుష్కల రిక్వెస్ట్.. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దంటూ
కోహ్లీ, అనుష్కల రిక్వెస్ట్.. మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దంటూ
ఢిల్లీ నుంచి విజయవాడకు నారా లోకేష్.. రేపు చంద్రబాబుతో భేటీ..
ఢిల్లీ నుంచి విజయవాడకు నారా లోకేష్.. రేపు చంద్రబాబుతో భేటీ..
సినిమా ఫ్లాప్‌ అయ్యిందిగా, ఇంకెందుకు బతికున్నావ్‌ అన్నారు..
సినిమా ఫ్లాప్‌ అయ్యిందిగా, ఇంకెందుకు బతికున్నావ్‌ అన్నారు..
ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద..
ఆదర్శ్ రాడు అంటూ మురారీకి అబద్దం చెప్పించిన ముకుంద..