పుట్టినరోజున అయ్యన్నకు షాక్.. వైసీపీలోకి సన్యాసి..?

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు, నర్సీపట్నం టీడీపీ అధ్యక్షుడు సన్యాసిపాత్రుడు టీడీపీకి రాజీనామా చేశారు. నర్సీపట్నంలో నారా లోకేష్ పర్యటనలో ఉండగానే తన రాజీనామాతో షాక్ ఇచ్చాడు సన్యాసిపాత్రుడు. కాగా అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు లోకేష్ ఇవాళ నర్సీపట్నం వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఊహించని షాక్ తగిలింది. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 23 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది […]

పుట్టినరోజున అయ్యన్నకు షాక్.. వైసీపీలోకి సన్యాసి..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 04, 2019 | 10:54 AM

ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు, నర్సీపట్నం టీడీపీ అధ్యక్షుడు సన్యాసిపాత్రుడు టీడీపీకి రాజీనామా చేశారు. నర్సీపట్నంలో నారా లోకేష్ పర్యటనలో ఉండగానే తన రాజీనామాతో షాక్ ఇచ్చాడు సన్యాసిపాత్రుడు. కాగా అయ్యన్నపాత్రుడు జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు లోకేష్ ఇవాళ నర్సీపట్నం వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఊహించని షాక్ తగిలింది. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 23 సీట్లతో సరిపెట్టుకున్న టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది పార్టీకి రాజీనామా చేసి వైసీపీ, బీజేపీలో చేరగా.. మరికొందరు కూడా అదే దారిలో ఉన్నారని తెలుస్తోంది. ఇక తాజాగా సన్యాసిపాత్రుడు కూడా వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాడని.. ఇందుకు సంబంధించి ఆ పార్టీ నేతలతో గత కొద్ది రోజులుగా సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు సన్యాసిపాత్రుడు దూరంగా ఉంటూ వస్తున్నారు.