Thammineni : ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి అస్వస్థత… తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో కొనసాగుతోన్న చికిత్స
కరోనా వైరస్ బారిన పడిన సీతారాం దంపతులు గత నెల 12వ తేదీన కరోనా నుంచి కోలుకున్నారు..
Tammineni Seetharam : ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. సీతారాం గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. కాగా, కరోనా వైరస్ బారిన పడి సీతారాం దంపతులు గత నెల 12వ తేదీన కొవిడ్ నుంచి కోలుకున్నారు. సీతారాం కంటే ముందు.. ఆయన సతీమణి వాణీశ్రీకి వైరస్ సోకింది. దీంతో దంపతులిద్దరూ శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొంది అనంతరం కోలుకుని ఇంటికి వెళ్లారు. అయితే, ఆదివారం నుండి సీతారాం అస్వస్థతకు గురై బాధపడుతుండటంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం అమరావతిలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
Read also : SV Prasad : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కరోనాతో కన్నుమూత