Rain Alert: ఏపీలో రెయిన్ అలర్ట్.. మరో మూడు రోజులపాటు వర్షాలు.. ఉరుములు మెరుపులతో..
Weather forecast for AP: నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతన్నాయి. మరో రెండు రోజుల్లో కేరళలో ప్రవేశించే అవకాశముంది. దీంతో ఎండలతో
Weather forecast for AP: నైరుతి రుతుపవనాలు మరింత బలపడుతన్నాయి. మరో రెండు రోజుల్లో కేరళలో ప్రవేశించే అవకాశముంది. దీంతో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలగనుంది. రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఏపీలో రాగల మూడు రోజుల వాతావరణ పరిస్థితుల గురించి ప్రకటనను విడుదల చేసింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా మారుతున్న కారణంగా ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉరుములు మెరుపులతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేక రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు సైతం కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ: ఈ రోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనను విడుదల చేశారు.
Also Read: