Crime news: అల్లరిపిల్ల ముఠా లీలలు.. ఫేస్ బుక్ లో పరిచయం.. అర్ధనగ్నంగా వీడియో చాట్
సోషల్ మీడియా(Social Media) పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు మోసాలు జరుగుతూనే ఉంటాయి. తెలియని వారి నుంచి మెసేజ్ లు, లింక్ లు వస్తే వాటిని తెరవకపోవడం మంచిది. అలా కాదని లింక్ ఓపెన్ చేస్తే...
సోషల్ మీడియా(Social Media) పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడప్పుడు మోసాలు జరుగుతూనే ఉంటాయి. తెలియని వారి నుంచి మెసేజ్ లు, లింక్ లు వస్తే వాటిని తెరవకపోవడం మంచిది. అలా కాదని లింక్ ఓపెన్ చేస్తే కొన్ని కొన్ని సార్లు సైబర్ మోసాలకు గురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మధ్య ఇలాంటి మోసాలు నిత్యకృత్యమయ్యాయి. తాజాగా చిత్తూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఫేస్‌బుక్ ( Face Book) లో ‘అల్లరి పిల్ల’ ఖాతా ద్వారా అమాయకులను పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని చిత్తూరుకు చెందిన సీకే మౌనిక్ అల్లరిపిల్ల మాయలో పడి రూ.3.64 లక్షలు మోసపోయాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో ఎస్పీ సెంథిల్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఫేస్‌బుక్‌లో అల్లరిపిల్ల అనే పేరుతో ఖాతా సృష్టించి ఈ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారిని ఎంపిక చేసుకుని వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తారు. రిక్వెస్ట్ ఓకే చేసిన వెంటనే ప్రొఫైల్ ఫొటోలోని మహిళ మెసేజ్ చాట్ చేస్తుంది.
క్రమంగా వీడియో చాట్‌కు ఆహ్వానిస్తుంది. వారు పంపిన లింక్ క్లిక్ చేయగానే ఫొటోలోని మహిళ అర్ధనగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతుంది. అవతలి వ్యక్తి ఫోన్ ఆపరేటింగ్ యాక్సిస్‌ను తన ఆధీనంలో వచ్చేలా చేస్తుంది. ఈ క్రమంలో విశాఖపట్నం నగరానికి చెందిన సీకే మౌనిక్.. ఇదే విధమైన లింక్ ను క్లిక్ చేసి మహిళతో మాట్లాడాడు. ఖాతా వివరాల ఆధారంగా రూ.3,64,227ను నాలుగు విడతలుగా తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో ఐదు రోజుల్లోనే అల్లరిపిల్ల మోసగాళ్లను పోలీసులు గుర్తించారు. ఫలితంగా విశాఖ నగరానికి చెందిన సాంబశివరావు, ఆనంద్‌మెహతా, శ్రీను, కుమార్‌రాజా, మహేష్, గొంతెన శివకుమార్, వరంగల్‌కు చెందిన శ్రావణ్ కుమార్, కడపకు చెందిన సుధీర్ కుమార్ లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అల్లరిపిల్ల పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
Also Read
Elections: ‘నా భార్య ఓడిపోయింది.. డబ్బులు ఇచ్చేయండి’.. నెట్టింట్లో రచ్చ చేస్తోన్న షాకింగ్ వీడియో..