AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బాప్ రే జస్ట్ మిస్.. కింగ్ కోబ్రాను పట్టుకోబోయిన యువకుడు.. దాని రియాక్షన్ చూస్తే అదిరపడాల్సిందే..!

Viral Video: కింగ్ కోబ్రా అంత్యత ప్రమాదకరమైన, విషపూరితమైన పాము అనే విషయం మనందరికీ తెలిసిందే. కింగ్ కోబ్రా కాటు వేస్తే ఎంత పెద్ద జీవి

Viral Video: బాప్ రే జస్ట్ మిస్.. కింగ్ కోబ్రాను పట్టుకోబోయిన యువకుడు.. దాని రియాక్షన్ చూస్తే అదిరపడాల్సిందే..!
King Cobra
Shiva Prajapati
|

Updated on: Mar 08, 2022 | 7:48 PM

Share

Viral Video: కింగ్ కోబ్రా అంత్యత ప్రమాదకరమైన, విషపూరితమైన పాము అనే విషయం మనందరికీ తెలిసిందే. కింగ్ కోబ్రా కాటు వేస్తే ఎంత పెద్ద జీవి అయినా క్షణాల్లో ప్రాణాలు కోల్పోవడం ఖాయం. అయితే, సరిసృపాలు సాధారణంగా ఎవరి జోలికి వెళ్లవు. వాటికి ప్రమాదం పొంచివుందని అవి భావించినప్పుడు అవి ఇతర జీవులను కాటేస్తాయి. అయితే, జన సంచార ప్రాంతాల్లోకి వచ్చే పాములను చాలామంది కొట్టి చంపేస్తుంటారు. ఈ చర్యను స్నేక్ లవర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాములు జనసంచార ప్రాంతాల్లోకి వస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా, సరిసృపాలను రక్షించడానికి స్నేక్ క్యాచర్స్.. తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. అలాంటి ఘటనలో ఎన్నింటినో మనం చూశాం కూడా. తాజాగా అలాంటి భయంకరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో భారీ కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్‌ను హడలెత్తించింది. జస్ట్ మిస్‌లో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

వివరాల్లోకెళితే.. ఓ ఇంట్లో కింగ్ కోబ్రా ఉన్నట్లు సమాచారం అందుకున్నారు స్నేక్ క్యాచర్. వెంటనే అతను ఆ పామును పట్టుకునేందుకు గ్రామానికి వెళ్లాడు. ఇంట్లో దాగి ఉన్న కింగ్ కోబ్రాను కనిపెట్టి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ కింగ్ కోబ్రా ఎంతకీ లొంగలేదు. పైగా బుసలు కొడుతూ అతనిపై దూసుకెళ్లింది. పలుమార్లు ప్రయత్నించినప్పటికీ.. కోబ్రా అతనిపై బుసలు కొడుతూ దాడి చేసేందుకు ప్రయత్నించింది. దాంతో అతను భయపడుతూనే జాగ్రత్తగా వ్యవహరించాడు. చివరకు కోబ్రాను పట్టుకుని ఒక సంచిలో బందించాడు. అనంతరం అక్కడి నుంచి తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో క్షేమంగా వదిలేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పుడే చూసేయండి.

Also read:

Healthy Heart Tips: “ఆమె”నే వెంటాడుతున్న గుండె నొప్పి.. కారణాలు తెలిస్తే షాక్ అవుతారు..

Women’s Day 2022: తెలంగాణ మణిహారం మల్లన్న సాగరం.. ఈ ప్రాజెక్టులో మరిచిపోలేని ‘ఆమె’ కృషి..

Anasuya Bharadwaj: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అనసూయ తాజా ట్వీట్.. ఓ రేంజ్‌లో ఇచ్చిపడేస్తున్న నెటిజన్లు..