Elections: ‘నా భార్య ఓడిపోయింది.. డబ్బులు ఇచ్చేయండి’.. నెట్టింట్లో రచ్చ చేస్తోన్న షాకింగ్ వీడియో..
Elections: ప్రస్తుత కాలంలో ఎన్నికలొస్తే చాలు ధన ప్రవాహమే ఉంటుంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు.
Elections: ప్రస్తుత కాలంలో ఎన్నికలొస్తే చాలు ధన ప్రవాహమే ఉంటుంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎంత డబ్బునైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధమైపోతున్నారు. మొత్తానికి ఓటర్లను ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేయాలో.. అన్ని రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అయితే, కొందరు మాత్రం ఎన్నికల వేళ ఒకలా.. ఎన్నికలు ముగిసిన తరువాత ఒకలా ప్రవర్తించి వార్తల్లో నిలుస్తుంటారు. వాస్తవానికి మన తెలుగునాట ఒక సామెత ఉంది. ‘‘ఎన్నికల్లో ఓడిన వారు ఆరుబయట ఏడిస్తే.. గెలిచిన వారు ఇంట్లోకెళ్లి ఏడుస్తారట’’. ఎందుకంటే ఎన్నికల్లో ఓడినవారు ఎంత ఖర్చు చేస్తే.. గెలిచిన వారు కూడా అంతే స్థాయిలో ఖర్చు చేస్తారట. ఈ సంగతి పక్కన పెడితే.. కొందరు మాత్రం తాము ఆ రకం కాదని ఖరాకండిగా తేల్చి చెప్పేస్తారు. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత.. ఎవరెవరికి ఎంత పంచారో లెక్కలు తీసి మరీ వారి వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేస్తారు. తాజాగా అలాంటి ఘనకు సంబంధించిన వీడియో ఓకటి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తన భార్య ఎన్నికల్లో ఓడిపోయిందనే కారణంతో అభ్యర్థి భర్త.. నేరుగా ఓటర్ల ఇళ్లకు తాము పంచి డబ్బులను తిరిగి వసూలు చేసుకుంటున్నాడు. ఒడిశాకు చెందిన ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
సమాచారం ప్రకారం.. ఒడిశాలోని బలంగీర్ జిల్లా ఉపర్జార్ గ్రామంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓ వ్యక్తి భార్య పోటీ చేయగా.. ఆమె ఓటమిపాలైంది. ఎన్నికల్లో గెలుపొందేందుకు వారు ఓటర్లను అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేశారు. డబ్బులు, మద్యం వగైరా అనేక రకాలు పంచిపెట్టారు. తీరా ఎన్నికల్లో ఓటిపాలవడంతో వారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇంత పంచిపెట్టినా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఓటర్లపై రగిలిపోయాడు అభ్యర్థి. ఇంకేముందు.. నేరుగా ఓటర్ల ఇళ్లకు వెళ్లి తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టాడు. ఓ ఓటర్ ఇంట్లోకి వెళ్లి ఇలాగే అడుగుతుండగా.. ఇంట్లోని వ్యక్తులు వీడియో చిత్రీకరించారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
Also read:
Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!
Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!
Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..