AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం.. ఇరు పార్టీల్లోనూ రెబల్స్‌ టెన్షన్‌

పీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, టీచర్‌ ఎమ్మెల్సీలను క్లీన్‌స్వీప్ చేసింది అధికార వైసీపీ. కానీ పట్టభద్రుల విషయానికి వచ్చేసరికి అనూహ్య ఫలితాలు వచ్చాయి.

MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం.. ఇరు పార్టీల్లోనూ రెబల్స్‌ టెన్షన్‌
Ap Mlc Elections Polling
Basha Shek
|

Updated on: Mar 22, 2023 | 9:06 PM

Share

ఏపీలో రేపు మరో ఎన్నిక జరగనుంది. అధికార వైసీసీకి పోటీగా టీడీపీ కూడా బరిలోకి దిగడంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మొత్తం 7 ఖాళీలు ఉండగా 8 మంది పోటీలో నిలిచారు. ఇరు పార్టీల్లోనూ రెబల్స్ ఉండటంతో ఎవరు ఎవరికి ఓటెస్తారు? ఏమైనా సంచలనాలు నమోదవుతాయా అన్నది ఉత్కంఠను రేపుతోంది. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, టీచర్‌ ఎమ్మెల్సీలను క్లీన్‌స్వీప్ చేసింది అధికార వైసీపీ. కానీ పట్టభద్రుల విషయానికి వచ్చేసరికి అనూహ్య ఫలితాలు వచ్చాయి. మొత్తం 3 సీట్లనూ టీడీపీ గెల్చుకుంది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికారపక్షం అప్రమత్తమైంది. 7 స్థానాలను గెల్చుకునేలా పక్కాగా ప్రణాళికలు రచించింది. ఇప్పటికే ఓసారి ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించింది. అటు విజయవాడలో మూడు చోట్ల ఎమ్మెల్యేలకు విందు భేటీ కూడా ఏర్పాటు చేశారు.

అనూహ్యంగా బరిలోకి టీడీపీ..

వాస్తవానికి ఈ ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని భావించారు. కానీ అనూహ్యంగా టీడీపీ బరిలో నిలిచింది. అసెంబ్లీలో బలాబలాలను చూస్తే వైసీపీ 151 మంది సభ్యులు ఉన్నారు. అయితే టీడీపీ నుంచి గెల్చిన నలుగురు వైసీపీలో చేరారు. అలాగే జనసేన ఎమ్మెల్యే కూడా వైసీపీనే సపోర్ట్ చేస్తున్నారు. ఈ లెక్కన వైసీపీ మొత్తం బలం 156కు చేరింది. కానీ ఇటీవలే తిరుగుబాటు జెండా ఎగరేసిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి విషయంలో కాస్త టెన్షన్ నెలకొంది. సో .. వైసీపీ తన బలాన్ని 154గానే లెక్కిస్తోంది. వీళ్లను 7 టీమ్‌లుగా విభజించి.. ఒక్కో టీమ్‌కు ఒక్కో లీడర్‌ను పెట్టారు. ప్రస్తుతం ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే కచ్చితంగా 22 ఓట్లు కావాలి. అంటే ఈ 154 మందిలో ఒక్కఓటు కూడా నష్టపోకూడదు. ఇక టీడీపీ విషయానికి వస్తే .. వైసీపీలో చేరిన నలుగురిని మినహాయిస్తే ఆ పార్టీ సభ్యుల సంఖ్య 19. ఈ బలంతో MLC గెలిచే ఛాన్స్ లేదు. కానీ ఓటింగ్ రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరుగుతుంది. వైసీపీ రెబల్ ఓట్లపై టీడీపీ ఆశాలు పెట్టుకుంది. అందుకే చివరి నిమిషంలో తమ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధను బరిలో నిలిపింది.

వైసీపీ నుంచి పెన్మత్స సూర్యనారాయణ రాజు, కోలా గురువులు, ఇజ్రాయిల్, మ‌ర్రి రాజశేఖర్, జయమంగళం వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నం బరిలో ఉన్నారు. గురవారం అసెంబ్లీ మొదటి అంతస్తులోని కమిటీ హాల్‌లో పోలింగ్ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..