Elephant: తీగ తగిలిందా? విద్యుధాఘాతంతో చంపేశారా..? చిత్తూరు జిల్లాలో గజరాజు మృతిపై అనుమానాలు

చిత్తూరు జిల్లాలో గజరాజు మృతి కలకలం రేపుతోంది. సదుం మండలం చెరుకువారిపాలెంలో విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి చెందింది. ఏనుగు మృతిపై రైతుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

Elephant: తీగ తగిలిందా? విద్యుధాఘాతంతో చంపేశారా..? చిత్తూరు జిల్లాలో గజరాజు మృతిపై అనుమానాలు
Elephant
Follow us
Sanjay Kasula

|

Updated on: Apr 02, 2022 | 9:07 AM

చిత్తూరు జిల్లాలో(Chittoor district) గజరాజు మృతి(Elephant Electrocuted) కలకలం రేపుతోంది. సదుం మండలం చెరుకువారిపాలెంలో విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి చెందింది. ఏనుగు మృతిపై రైతుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గజరాజు మృతిపై అటుస్థానికులు, ఇటు అటవీశాఖ అధికారులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సదుం మండలంలో వారం రోజులుగా ఏనుగుల గుంపు సంచరిస్తోంది. ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

జోగివారిపల్లె పొలంలో నిద్రిస్తున్న ఎల్లప్ప అనే రైతును ఏనుగుల గుంపు తొక్కి చంపాయి. ఏనుగుల గుంపు పంటపొలాలను ధ్వంసం చేస్తుండటంతో కాపలా కోసం వెళ్లిన రైతు … అక్కడే నిద్రిస్తుండగా గజరాజులు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఎల్లప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడ్రోజుల క్రితం జోగువారిపల్లికి చెందిన ఎల్లప్ప అనే రైతును ఓ ఏనుగు తొక్కి చంపిన సంగతి తెలిసిందే.

అయితే.. అదే ఏనుగు విద్యుత్‌షాక్‌తో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏనుగు ప్రమాదవశాత్తు విద్యుత్‌ తీగలకు తగిలిందా? లేక విద్యుధాఘాతంతో చంపేందుకు ఎవరైనా ప్లాన్‌ చేశారా..? అన్న కోణంలో అటవీశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. విచారణ పూర్తయితేగాని ఏనుగు మృతిపై క్లారిటీ వచ్చేలా లేదు.

ఇవి కూడా చదవండి: Rachakonda Police: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న వారికి ఉచిత కోచింగ్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Drugs Case: డ్రగ్స్‌ కొనుగోళ్లకు కేటుగాళ్ల సీక్రెట్‌ కోడ్‌.. మత్తు దందాలో వెలుగులోకి కొత్త కోణాలు.