AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీ.. నిందితుడి గుర్తింపు!

ఆలయాలను టార్గెట్ చేస్తున్న దొంగలు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి సమయంలో ఆలయాల్లోకి చొరబడి చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా.. గోకవరం మండలం మల్లవరం గ్రామంలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డాడు యువకుడు. దర్జాగా ఆలయంలోని రెండు హుండీలలోని నగదును ఎత్తుకెళ్లాడు. చివరికి ఇలా దొరికిపోయాడు దొంగ.

Balaraju Goud
|

Updated on: Nov 07, 2025 | 8:59 AM

Share

ఆలయాలను టార్గెట్ చేస్తున్న దొంగలు రెచ్చిపోతున్నారు. అర్థరాత్రి సమయంలో ఆలయాల్లోకి చొరబడి చోరీలకు తెగబడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా.. గోకవరం మండలం మల్లవరం గ్రామంలోని ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డాడు యువకుడు. దర్జాగా ఆలయంలోని రెండు హుండీలలోని నగదును ఎత్తుకెళ్లాడు. ఆలయ వైస్ చైర్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించి నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. దొంగతనానికి పాల్పడిన యువకుడు అదే గ్రామానికి చెందిన గుర్రం సాయి ఆదిత్య మాధవన్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. నిందితుడిరి అరెస్ట్ చేసి, రాజమహేంద్రవరం జ్యూడిషియల్ కోర్టులో హాజరు పర్చారు. నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లుగా ఎస్సై పవన్ వెల్లడించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us