Wonderful Nest: పురుగు పెట్టిన అద్భుతమైన గూడు.. చూస్తే ఔరా అనక మానరు..!
Wonderful Nest: పేద ప్రజలకు గూడు కల్పించటానికి తెలుగు రాష్ట్రాల పాలకులతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం భిన్నమైన పథకాలను అమలు చేస్తున్నాయి. మరి ఓటు హక్కు లేని పక్షులు
Wonderful Nest: పేద ప్రజలకు గూడు కల్పించటానికి తెలుగు రాష్ట్రాల పాలకులతో పాటు కేంద్ర ప్రభుత్వం సైతం భిన్నమైన పథకాలను అమలు చేస్తున్నాయి. మరి ఓటు హక్కు లేని పక్షులు, జంతువుల పరిస్థితి ఏంటి.. అని ఎపుడైనా, ఎవరైనా ఆలోచించారా? అంటే ఆ ఛాన్స్ లేదని బల్లగుద్ది చెప్పొచ్చు. ఎందుకంటే అవి మనుషులు కాదు కదా! ప్రస్తుత కాలంలో మనుషులే తోటి మనుషులను పట్టించుకోవడం లేదు. అలాంటిది పక్షులు, జంతువుల గురించి పట్టించుకుంటారా!. ఇదే అంశంపై ఎవరినైనా ప్రశ్నిస్తే.. ఎవరి బాధలు వారికి ఉన్నాయి.. పక్కోళ్ల బాధలు పట్టించుకు తీరిక ఎక్కడిది సామీ అంటూ నిట్టురుస్తారు. అయితే ప్రకృతిలో మనుషులతో పాటు జీవించే పక్షులు, జంతువులు, పురుగులు సైతం తమకంటూ ఒక నివాసాన్ని, ఆవాసాన్ని చూసుకుంటాయి. ఏర్పాటు చేసుకుంటాయి. అలాంటి వాటిల్లో గిజిగాడు పెట్టేగూల్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంజనీరింగ్ నిపుణులకు సైతం అంతుపట్టని రీతిలో ఈ గూళ్ల నిర్మాణం కనిపిస్తుంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు ప్రాంతంలో ఎన్నడూ, ఎవరూ చూడని ఒక పురుగు గూడు ఒక ఇంటివద్ద కనిపించింది. రేగు ఆకులను మిటాయిపొట్లాల మాదిరిగా చేసుకుని అందులో ఓ పురుగు నివాసం ఎర్పాటు చేసుకుంది. దాన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఒక్కో ఆకును జాగ్రతగా ఊడదీసి చూసినా అందులో ఏమి కనిపించలేదు. ఏ ఒక్క కుట్టు, అతుకు లేకుండా పచ్చటి రేగు ఆకులతో అద్భుతమైన నిర్మాణం చేసింది ఆ పరుగులు. మరి ఇంతటి గొప్పు నైపుణ్యం ప్రదర్శించిన ఆ పురుగుకు అందరూ సలాం కొట్టాల్సిందే.
బి. రవి కుమార్, టీవీ9 రిపోర్టర్, పశ్చిమగోదావరి జిల్లా.
Also read:
Immunity Booster: శీతాకాలంలో వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఈ ‘టీ’ తాగండి.. మరింత బలంగా మారండి..!