అక్రమ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల ఉన్న వ్యక్తిని చూసి షాక్

కొత్త సంవత్సరం వేడుకల వేళ దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్ద ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ మద్యాన్ని రాష్ట్రంలోకి తరలించేందుకు యత్నించి ముగ్గురు పట్టుబడ్డారు. అందులో ఒకతను...

అక్రమ మద్యాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల ఉన్న వ్యక్తిని చూసి షాక్
Illegal Liquor (File Photo)
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 01, 2024 | 6:40 PM

న్యూ ఇయర్ అంటే జోష్ మాములుగా ఉంటుందా…? అలవాటు ఉన్నవారందరూ మత్తులో ఊగిపోతుంటారు. తాగుతూ.. ఊగుతూ.. చిందేస్తూ.. ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఏపీలో లిక్కర్ సేల్స్ తగ్గించాలనే ఉద్దేశంతో అక్కడి జగన్ సర్కార్.. రేట్లను భారీగా పెంచింది. అంతేకాదు చాలా బ్రాండ్లను కూడా పరిమితం చేసింది. దీంతో తెలంగాణ నుంచి తక్కువ రేటుకు లిక్కర్ తెచ్చి.. ఏపీలో అమ్ముకుందామని చాలామంది ప్లాన్ చేశారు. అలాంటి వాళ్లలో కొందరు పట్టుబడ్డారు. పోలీసులకు చిక్కిన వ్యక్తుల్లో ఏకంగా ఓ ఏఎస్సై ఉండటం చర్చనీయాశంమైంది. అవును.. అక్రమ మద్యం తరలిస్తూ ఏఎస్సై పట్టుబడ్డాడు. పల్నాడు జిల్లా దాచేపల్లి పరిధిలో ఈ ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే… కొత్త సంవత్సరం వేడుకల వేళ దాచేపల్లి మండలం పొందుగుల చెక్‌పోస్టు వద్ద ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు.  ఈ క్రమంలో తెలంగాణ మద్యాన్ని రాష్ట్రంలోకి తరలించేందుకు యత్నించి ముగ్గురు పట్టుబడ్డారు. అయితే ఒకతను తమ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తే అని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. గురజాల పోలీసు స్టేషన్‌కు చెందిన ఏఎస్సై స్టాలిన్‌తో పాటు మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 42 మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఇయర్ వేళ ఈ పనికి పూనుకున్నారా..? లేక గతంలో కూడా ఇదే మాదిరిగా అక్రమ మద్యాన్ని రవాణా చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..