Andhra Pradesh: ఒకరితో సహజీవనం.. మరొకరితో పెళ్ళి.. చివరికి ఎంత ఘోరానికి తెగబడ్డాడంటే..
చిన్నప్పుడే వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో తాడేపల్లిలోని ఓ హోటల్‌లో పనిచేస్తుండగా గుడివాడకు చెందిన 30 ఏళ్ళ సుహాసిని పరిచమమైంది. అప్పటికే భర్తతో విడిపోయి 13 ఏళ్ళ కూతురు ఉన్న సుహాసిని తనకు పరిచయమైన ఉలవ సురేష్‌తో సహజీవనం సాగించింది. ఈ క్రమంలో వీరికి..

ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి గోదావరి వంతెన మీద నుంచి ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలను నదిలోకి తోసేసి కారులో పారిపోయిన నిందితుడు ప్రకాశంజిల్లా పొదిలి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఉలవ సురేష్‌గా గుర్తించారు.. ఈ ఘటనలో తల్లి, ఏడాది చిన్నారి నదిలో కొట్టుకుపోయారు. 13 ఏళ్ల బాలిక ప్రాణాలతో బయటపడింది. ఏడాది వయస్సున్న చిన్నారి జెస్సీ మృతదేహాం నదిలో లభ్యమైంది. గల్లంతైన మహిళ సుహాసిని కోసం గాలిస్తున్నారు. సుహాసిని స్వస్థలం తాడేపల్లి కాగా, నిందితుడు సురేష్ స్వగ్రామం ప్రకాశంజిల్లా ఉప్పలపాడుగా గుర్దించారు.
ఒకరితో సహజీవనం.. మరొకరితో పెళ్ళి..
ప్రకాశంజిల్లా ఉప్పలపాడు గ్రామానికి చెందిన 30 ఏళ్ళ ఉలవ సురేష్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోయి వేర్వేరు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. దీంతో సురేష్ చిన్నప్పుడే వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో తాడేపల్లిలోని ఓ హోటల్‌లో పనిచేస్తుండగా గుడివాడకు చెందిన 30 ఏళ్ళ సుహాసిని పరిచమమైంది. అప్పటికే భర్తతో విడిపోయి 13 ఏళ్ళ కూతురు ఉన్న సుహాసిని తనకు పరిచయమైన ఉలవ సురేష్‌తో సహజీవనం సాగించింది. ఈ క్రమంలో వీరికి ఒక పాప పుట్టింది. ప్రస్తుతం ఆ పాపకు ఏడాది వయస్సు ఉంది. ఈ నేపధ్యంలో సుహాసినికి తెలియకుండా ఉలవ సురేష్ మరో యువతిని మూడు నెలల క్రితం పెళ్ళి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన సుహాసిని తనకు అన్యాయం ఎలా చేస్తావని ప్రశ్నించింది. తనతోనే ఉండాలని పట్టుబట్టింది. ఈ క్రమంలో సుహాసినితో పాటు ఆమె పిల్లలను ఎలాగైనా వదిలించుకోవాలన్న ఉద్దేశ్యంతో విహారయాత్రకు వెళ్దామంటూ ఆదివారం తెల్లవారుజామున 3.50 గంటలకు కారులో రావులపాలెం గౌతమి వంతెన వద్దకు తీసుకెళ్లాడు సురేష్. సెల్ఫీ దిగుదామంటూ నమ్మబలికిన సురేష్.. తల్లి, ఇద్దరు కూతుళ్లను వంతెనపై నుంచి నదిలోకి తోసేశాడు. ఈ ఘటనలో తల్లి, ఏడాది వయసున్న చిన్నారి నదిలో కొట్టుకుపోయారు. 13 ఏళ్ళ వయస్సున్న బాలిక కీర్తన నదిలో పడిపోయే సమయంలో వంతెనకు ఉన్న పైపును పట్టుకుని ప్రాణాలు కాపాడుకుంది. ఒక వైపు పైపును పట్టుకుని వేలాడుతూనే ఎంతో ధైర్యం ప్రదర్శించి తన జేబులో ఉన్న సెల్‌పోన్‌తో 100 కు ఫోన్ చేసి తనను రక్షించమని తెలిపింది. కాల్ అందుకున్న వెంటనే పోలీసులు వంతెన దగ్గరకు చేరుకుని బాలికను రక్షించారు. గల్లంతైన తల్లీ, ఏడాది కూతురు కోసం గాలించారు. ఏడాది వయస్సున్న పాప జెర్సీ మృతదేహం లభ్యమైంది. అయితే తల్లి సుహాసిని ఆచూకీ లభ్యంకాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడు సురేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
సురేష్‌ది ప్రకాశంజిల్లా ఉప్పలపాడు..
ఈ దారుణ ఘటనలో నిందితుడిగా ఉన్న ఉలవ సురేష్ స్వగ్రామం ప్రకాశంజిల్లా పొదిలి మండలం ఉప్పలపాడుగా గుర్తించారు. ఇతని తల్లిదండ్రలు చిన్నప్పుడే విడిపోయి వేర్వేరు పెళ్ళిళ్ళు చేసుకోవడంతో ఇతర ప్రాంతాల్లో పెరిగి పెద్దవాడైన సురేష్ కొంతకాలం హైదరాబాద్‌లో ఉన్నాడు. అనంతరం తాడేపల్లిలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న క్రమంలో అప్పటికే భర్తతో విడిపోయిన సుహాసినితో ఏర్పడిన పరిచయం సహజీవనానికి దారితీసింది. అప్పటికే సుహాసినికి పదమూడేళ్ళ కూతురు కీర్తన ఉంది. సురేష్ స్వగ్రామం వాస్తవానికి ప్రకాశం జిల్లాలోని ఉప్పలపాడే అయినా ప్రస్తుతం అతని దూరపు బంధువులు మినహా గ్రామంలో ఎవరూలేరు. చిన్నతనంలోనే సురేష్ తల్లిదండ్రులు విడిపోయి వేర్వేరు పెళ్ళిళ్ళు చేసుకుని ఇతర ప్రాంతాల్లో స్థిరపడటంతో సురేష్ కూడా గ్రామానికి వచ్చేవాడు కాదని గ్రామస్థులు చెబుతున్నారు. సురేష్ చేసిన దారుణం గురించి తమకు తెలియదని అంటున్నారు. సురేష్ వివరాల గురించి చెప్పేందుకు నిరాకరిస్తున్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..