Andhra Pradesh: రామచిలుకల ఆకలి తీరుస్తున్న వ్యక్తి.. ఇంటిపై గుంపులుగుంపులుగా చిలకలు
జంతువులను, పక్షులను పెంచుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే పెంచుకోవడమే కాకుండా వాటి ఆకలిని తీరుస్తుంటారు. పక్షులకు మంచి నీటితో పాటు, ఆహారాన్ని కూడా అందిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి రామచిలుకల ఆకలి తీరుస్తున్నాడు. ఇలా ఒకటి, రెండు కాదు ఏకంగా.. పదేళ్ల నుంచి వాటి ఆలనపాలన చూస్తున్నాడు. అంబేద్కర్ కోనసీమ..
జంతువులను, పక్షులను పెంచుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే పెంచుకోవడమే కాకుండా వాటి ఆకలిని తీరుస్తుంటారు. పక్షులకు మంచి నీటితో పాటు, ఆహారాన్ని కూడా అందిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి రామచిలుకల ఆకలి తీరుస్తున్నాడు. ఇలా ఒకటి, రెండు కాదు ఏకంగా.. పదేళ్ల నుంచి వాటి ఆలనపాలన చూస్తున్నాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి చేస్తున్న ఈ పనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది.
వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం అన్నాయిపేట గ్రామంలో మద్దూరి దొరబాబు ఇంట్లో రామచిలుకలు సందడి చేస్తున్నాయి. గత పది సంవత్సరాల క్రితం నుంచి దొరబాబు పక్షులు మీద మమకారంతో తన ఇంటి డాబా పైన ధాన్యపు కుచ్చులను కట్టి, రామ చిలుకకలకు ఆహారం సమకూర్చుతున్నాడు. ధాన్యం కుచ్చులు వరి పంట సమయంలో తప్ప మిగతా రోజుల్లో లభించకపోవడంతో బియ్యం గింజలను ఆహారంగా పెడుతున్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవల దొరబాబు పుట్టిన రోజు జరిగింది. దీంతో తన పుట్టిన రోజున తను ఎంతో ఇష్టపడే రామచిలుకలకు పసందైన విందు ఏర్పాటు చేయాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రత్యేకంగా రామ చిలుకలకు ప్రేమ విందు (పసందైన విందు )ఏర్పాటు చేశాడు. ఈ విందులో బియ్యం, వేరుశనగ మొక్కజొన్న గింజలను చల్లాడు. అనంతరం మేడ పై నుంచి కిందికి రాగానే.. రామచిలకలు గుంపులు గుంపులుగా వచ్చి ఈ ఆహారాన్ని తింటూ సందడి చేశాయి. పసందైన విందును ఆరగించే రామ చిలుకల దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..