Andhra Pradesh: ఊహించని ప్రమాదం.. క్షణాల్లో మీదపడిన భారీ మర్రిచెట్టు..
ఊహించని ప్రమాదం.. క్షణాల్లో మీదపడింది. రోడ్డు పక్కనున్న పేద్ద మర్రిచెట్టు ఉన్నట్టుండి కూలిపోయింది. అదే టైమ్‌లో బైక్‌పై అటుగా వెళ్తున్న..
ఊహించని ప్రమాదం.. క్షణాల్లో మీదపడింది. రోడ్డు పక్కనున్న పేద్ద మర్రిచెట్టు ఉన్నట్టుండి కూలిపోయింది. అదే టైమ్‌లో బైక్‌పై అటుగా వెళ్తున్న వారిపై ఆ చెట్టు పడిపోవడంతో ఇద్దరు గాయాలపాలయ్యారు. చాలా లక్కీగా బైక్‌పై ఉన్న వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారు. ఐతే.. ఓ వ్యక్తి కాలు చెట్టు కింద ఇరుక్కుపోవడంతో ఆ దారిలో వెళ్తున్న వాళ్లంతా ఆగి అతన్ని బయటకు లాగారు.
బాపట్ల జిల్లాలోని వేటపాలెం మండలం రామన్నపేట – పందిళ్ళపల్లి మధ్య జరిగిందీ ఘటన. ఈ రూట్‌లో ఓ భారీ మర్రి చెట్టు ఎప్పట్నుంచో ఉంది. అదే ఇప్పుడు పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వాళ్లను వెంటనే 108లో చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. జేసీబీని కూడా తెప్పించి వెంటనే చెట్టు పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..