Andhra Pradesh: క్రికెట్ ఆడుతున్న పిల్లలపై కొండముచ్చు కోతి దాడి.. ఏడుగురికి తీవ్ర గాయాలు
పాఠశాలకు సెలవు కావడంతో సరదాగా పిల్లలంతా మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఒక్కసారిగా కొండముచ్చుకోతి పిల్లలపై దాడి చేసింది. దూసుకువచ్చిన కొండముచ్చుతో కంగారుపడ్డ భయంతో పిల్లలు పరుగులు తీశారు. అయినప్పటికీ వారిని వదలకుండా దాడి చేసింది. ఈ ఘటనలో ఏడు మంది పిల్లలను గాయపర్చించింది. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన పిల్లలను స్థానికులు హుటాహుటీన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నంధ్యాల జిల్లా డోన్ పట్టణంలో జరిగింది.

కొండముచ్చు దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే స్పందించడంతో పిల్లల ప్రాణాలు దక్కాయి. పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికలు కట్టెలు తీసుకుని కొండముచ్చు కోతిని తరమడంతో పిల్లలకు ప్రాణాపాయం తప్పింది. కాగా, ఈ ఘటనలో కొందరు స్థానికులు కూడా గాయపడ్డారు. తీవ్ర రక్త గాయాల పాలైన పిల్లలని హుటాహుటిన డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వారికి ప్రథమ చికిత్స అందించడంతో ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గతంలో కొండముచ్చు కోతి దాడులు చేస్తుండగా ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని స్థానికుల మండిపడుతున్నారు. ఇప్పటికైనా పట్టణంలో ఉన్న కొండముచ్చు కోతులను తరలించాలని స్థానికులు కోరుతున్నారు…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..