AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cradle Ceremony: వైభవంగా ఆవు దూడకు బారసాల.. పిండి వంటకాలతో భోజనాలు..

తమ ఇంట్లో పిల్లలు పుడితే ఎంత సంతోషపడి పండగ జరుపుకుంటామో అంతకుమించి ఆవు దూడకు బారసాల పండగ నిర్వహించారు. ఈ ఆవు దూడకు బారసాల వేడుక పశ్చిమ గొడవారి జిల్లాలో జరిగింది. 

Cradle Ceremony: వైభవంగా ఆవు దూడకు బారసాల.. పిండి వంటకాలతో భోజనాలు..
Calf Naming Ceremony
Surya Kala
|

Updated on: Apr 23, 2023 | 1:54 PM

Share

హిందువులకు ఆవు పవిత్ర జంతువు. గోమాతను పూజిస్తే సుఖ సంపదలు, అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తాయని విశ్వాసం. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారని పురాణాలు పేర్కొన్నాయి. చాలామంది ఆవునిపెంచుకోవడానికి ఇష్టపడతారు. ఆవులను వాటి సంతానానికి పేర్లు పెట్టి.. సొంత ఇంటి పిల్లల్లా భావించి అల్లముద్దుగా పెంచుకుంటున్నారు. తమ ఇంటిలో ఆవులకు సీమంతం, పుట్టిన రోజు , నామకరణం వంటి వేడుకలను జరిపిస్తూ సందడి చేస్తున్నారు. తమ ఇంట్లో పిల్లలు పుడితే ఎంత సంతోషపడి పండగ జరుపుకుంటామో అంతకుమించి ఆవు దూడకు బారసాల పండగ నిర్వహించారు. ఈ ఆవు దూడకు బారసాల వేడుక పశ్చిమ గొడవారి జిల్లాలో జరిగింది.

జిల్లాలోని పాలకోడేరు మండలం గొరగనమూడిలో ఆవు దూడకు బారసాల చేసారు ఆవు యజమాని. పంపన రామకృష్ణ, మహాలక్ష్మి దంపతులు ఒక ఆవును పెంచుకుంటున్నారు. ఆవుకు 21 రోజుల క్రితం దూడ జన్మించింది. దాంతో ఆ ఇంట్లో సంబరాలు జరుపుకున్నారు. అంతటితో ఆగకుండా 21 రోజులు గడిచాక ఆవు దూడను సుందరంగా అలంకరించిన ఉయ్యాలలో పడుకోబెట్టి బారసాల జరిపారు. ఉయ్యాలలో ఆవు దూడను ఉంచి ఉయ్యాల ఊపుతూ అక్షింతలు వేసి దీవించారు. చుట్టుపక్కల వారు, బంధువులను పిలిచి పండగ జరిపారు. వచ్చిన వారందరికీ పిండి వంటకాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఆవు దూడకు బారసాల జరిపడాన్ని స్థానికులు వింతగా చెప్పుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..