AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైన్ స్నాచర్లకి ఝలక్ ఇచ్చిన వ్యాపారి.. అవాక్కైన చైన్ స్నాచర్లు.. ఏమి చేశాడంటే..

ఓ వ్యాపారి చాకచక్యంగా వ్యవహరించి చైన్స్ స్నాచర్లనే మస్కా కొట్టించాడు. స్నాచింగ్ సమయంలో వ్యాపారి చేసిన పనిని చూసి చైన్ స్నాచర్స్‎తో పాటు అక్కడ ఉన్న స్థానికులు సైతం అవాక్కయ్యారు. ఇంతకీ అందరినీ కంగు తినేలా ఆ వ్యాపారి చేసిన పని ఏంటి అనుకుంటున్నారా? విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఇటీవల చైన్స్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నిత్యం ఎక్కడో చోట స్నాచింగ్ చేసి స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నారు. చైన్ స్నాచర్లు ప్రధానంగా మహిళలతో పాటు పలువురు వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు.

చైన్ స్నాచర్లకి ఝలక్ ఇచ్చిన వ్యాపారి.. అవాక్కైన చైన్ స్నాచర్లు.. ఏమి చేశాడంటే..
chain snatchers
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Mar 11, 2024 | 11:51 AM

Share

ఓ వ్యాపారి చాకచక్యంగా వ్యవహరించి చైన్స్ స్నాచర్లనే మస్కా కొట్టించాడు. స్నాచింగ్ సమయంలో వ్యాపారి చేసిన పనిని చూసి చైన్ స్నాచర్స్‎తో పాటు అక్కడ ఉన్న స్థానికులు సైతం అవాక్కయ్యారు. ఇంతకీ అందరినీ కంగు తినేలా ఆ వ్యాపారి చేసిన పని ఏంటి అనుకుంటున్నారా? విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఇటీవల చైన్స్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నిత్యం ఎక్కడో చోట స్నాచింగ్ చేసి స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నారు. చైన్ స్నాచర్లు ప్రధానంగా మహిళలతో పాటు పలువురు వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారు. అందుకోసం ముందుగా రెక్కీలు నిర్వహించి మరీ తమ చేతికి పదును పెడుతున్నారు. ఈ క్రమంలోనే రాజాంలో గున్నయ్య అనే వ్యాపారిపై దృష్టి పెట్టారు చైన్ స్నాచర్లు. వ్యాపారి గున్నయ్య ఎప్పుడు ధగధగ మెరిసే ఒక చైన్ ధరించి ఉంటాడు. అతనికి ఇలాంటి చైన్స్ వేసుకోవడం సరదా. అయితే గున్నయ్య మెడలో ఉన్న బలమైన చైన్ ను చూసిన స్నాచర్లు ఎలాగైనా సరే కాజేయాలని ప్లాన్ చేశారు. అందుకోసం ముందుగా గున్నయ్యపై రెక్కీ నిర్వహించారు. గున్నయ్య ఎప్పుడు ఇంట్లో నుండి వస్తాడు? ఎక్కడికి వెళ్తాడు? అని గమనించారు.

ఆ తర్వాత రోజు అనుకున్నట్లే గున్నయ్య తన సొంత గ్రామం విజయనగరం జిల్లా తెర్లాం మండలం పెరుమాలి నుండి ప్రక్కనే ఉన్న రాజాం పట్టణానికి కిరాణా సామానులు కొనడానికి మార్కెట్ నిమిత్తం వచ్చాడు. అలా వచ్చిన గున్నయ్యను చూసిన చైన్స్ స్నాచర్లు అతనిని కొంతసేపు ఫాలో అయ్యారు. ఆ తరువాత కొద్దిసేపు అతని బైక్‎ను ఫాలో అయ్యారు. తరువాత కొద్దిసేపటికి గున్నయ్య వద్దకు వెళ్లి నీ బైక్ టైర్ గాలి తక్కువగా ఉంది, చూసుకోండి అని చెప్పారు. వెంటనే గున్నయ్య నిజమేననుకొని బైక్ ఆపి టైర్ వైపు చూసే ప్రయత్నం చేశాడు. ఇంతలో స్నాచర్లు రెచ్చిపోయి గున్నయ్య మెడలో చైన్ తెంపుకొని బైక్ పై వేగంగా వెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితి గమనించిన గున్నయ్య పెద్ద పెద్దగా కేకలు వేస్తూ నా దగ్గర ఆ ఒక్క చైన్ కాదు మరొక చైన్ కూడా ఉంది, అది కూడా పట్టుకెళ్ళండి అని అరిచాడు.

దీంతో గున్నయ్య మాటలు విన్న చైన్స్ స్నాచర్లకు అసలు గున్నయ్య ఎందుకు అలా మాట్లాడాడో మొదట అర్థం కాలేదు. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత చైన్‎ను పరిశీలించారు. బంగారంపై అంతగా అవగాహన లేని చైన్ స్నాచర్లు ఆ చైన్‎ను పరిశీలించి ధగధగ మెరుస్తున్న చైన్ బంగారం కాదని అది రోల్డ్ గోల్డ్ చైన్ అని ఖంగుతిన్నారు. దీంతో స్నాచర్లు తిరిగి వెనక్కి వచ్చి నీ చైన్ నువ్వే ఉంచుకో అని గున్నయ్య వద్ద కోపంతో విసిరి పడేసి పారిపోయారు. స్నాచర్లు బంగారం దొంగిలించడం, తిరిగి వెనక్కి వచ్చి విసిరిపడేసి వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యవహారం అంతా చూసిన స్థానికులు గున్నయ్య తెలివితేటలు, గున్నయ్య వ్యవహరించిన తీరు చూసి ఆయనను ప్రశంసించారు. చైన్ స్నాచర్ల అమాయకత్వానికి నవ్వుకున్నారు. కాబట్టి తెగబడుతున్న చైన్ స్నాచర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉదాసీనంగా వ్యవహరించాలని కోరుతున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..