AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు..

పులివెందులలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సీఎం జగన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆసుపత్రులను ప్రారంభించనున్నారు. అంతేగాక పులివెందులలో ఎప్పటినుంచో ఏర్పాటు చేయాలనుకుంటున్న బనానా ప్యాక్ హౌస్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‎లను కూడా సీఎం ప్రారంభించనున్నారు. సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మొత్తం 10 అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

CM Jagan: కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు..
Cm Ys Jagan
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Mar 11, 2024 | 12:40 PM

Share

పులివెందులలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా సీఎం జగన్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆసుపత్రులను ప్రారంభించనున్నారు. అంతేగాక పులివెందులలో ఎప్పటినుంచో ఏర్పాటు చేయాలనుకుంటున్న బనానా ప్యాక్ హౌస్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‎లను కూడా సీఎం ప్రారంభించనున్నారు. సీఎం జగన్ కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో మొత్తం 10 అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. అందులో ముఖ్యంగా రూ.500 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఆసుపత్రులను ప్రారంభించునున్నారు. ఈ ఆసుపత్రి మొత్తం 51 ఎకరాలలో నిర్మించారు. అందులో జి ప్లస్ త్రీ భవనంలో ఓ పి డి సేవలకు అందుబాటులో ఉండేలాగా నిర్మించారు. అలానే జి ప్లస్ సిక్స్ భవనాన్ని ఐపిడి సేవలకు నిర్మించారు. వాటితో పాటు బేస్మెంటు, జి ప్లస్ త్రీ భవనాన్ని 24 గంటలు సేవలు అందుబాటులో ఉండేలాగా రూపొందించారు. వైద్యవిద్య చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల కోసం బాలురు, బాలికల కోసం వేరువేరు వసతి గృహాలను.. నర్సింగ్ కాలేజీ కోసం మరొక భవనాన్ని కూడా నిర్మించారు.

వీటన్నిటికీ దాదాపు రూ.500 కోట్లు ఖర్చైనట్లు తెలుస్తోంది. నాబార్డు నిధులు, ఆర్ ఐ డి ఎఫ్ నిధులను వెచ్చించారని అధికారులు తెలిపారు. మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం అనంతరం పులివెందులలో 20 కోట్లతో నిర్మించిన వైఎస్ జగన్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‎ను అలాగే రూ.65 కోట్లతో ఏర్పాటు చేసిన డాక్టర్ వైయస్సార్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్‎ను ప్రారంభించనున్నారు. అనంతరం రూ.175 కోట్లతో ఆదిత్య బిర్లా వాళ్లు ఏర్పాటుచేసిన రెండు ప్రొడక్షన్ బ్లాక్‎లను కూడా సీఎం ప్రారంభించనున్నారు. వాటితో పాటు రూ. 80 లక్షలతో అభివృద్ధి చేసిన గాంధీ జంక్షన్, రూ.11 కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ బోలివార్డ్, అలాగే రూ.70 లక్షలతో అభివృద్ధి చేసిన వైయస్సార్ జంక్షన్‎ను ప్రారంభించి పులివెందుల అరటి రైతుల కలయిన బనానా పార్క్ హౌజ్‎ను రూ.20 కోట్లతో అభివృద్ధి చేసి రైతులకు అందించనున్నారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మోడల్ సిటీలో భాగంగా స్టేట్ గవర్నమెంట్ నిధులతో నిర్మించారు. అనంతరం ఇడుపులపాయ చేరుకొని అక్కడ రూ.40 కోట్లతో అభివృద్ధి చేసిన డాక్టర్ వైయస్సార్ మెమోరియల్ పార్కును ప్రారంభించి అనంతరం కడప చేరుకొని అక్కడి నుంచి తాడేపల్లి బయలుదేరి వెళ్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..