Tirupati District: మేత తినేందుకు యత్నించిన గేదె.. ఒక్కసారిగా భారీ శబ్ధం.. పాపం స్పాట్‌లోనే

తిరుపతి జిల్లా శ్రీనివాసపురంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకుంది. అకస్మాత్తుగా పెద్ద శబ్ధం వినిపించడంతో అందరూ షాక్ తిన్నారు. అసలు ఏం జరిగిందంటే...?

Tirupati District: మేత తినేందుకు యత్నించిన గేదె.. ఒక్కసారిగా భారీ శబ్ధం.. పాపం స్పాట్‌లోనే
A representative image
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 17, 2022 | 4:09 PM

AP News: తిరుపతి జిల్లా శ్రీనివాసపురం(Srinivasapuram)లో నాటుబాంబుల కలకలం చెలరేగింది. కె.వి.బి.పురం మండలం(KVBPuram Mandal) శ్రీనివాసపురంలో నాటుబాంబు పేలుడు ఒక్కసారిగా ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. పశువుల మేతలో ఉన్న నాటుబాంబు పేలి గేదె మృతి చెందింది. పేలని మరో 3 నాటుబాంబులను స్థానికులు స్వాధీనం చేసుకున్నారు. నాటుబాంబులపై పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. పోలీసులు స్పాట్‌కు చేరుకుని.. పేలని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పశువుల మేతలో ఈ బాంబులను ఎవరు పెట్టారు..? వన్యప్రాణులు చంపడానికి బాంబులు పెట్టారా..? ఎవర్నైనా హత్య చేసేందుకు ప్లాన్ చేశారా అనే కోణాల్లో విచారణ జరుపుతున్నారు.  కాగా నాటుబాంబు పేలిన సమయంలో ప్రజలు ఎవరు లేకపోవటంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటన స్థానిక ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.

కర్నూలు జిల్లా పత్తికొండలో కూడా ఇలానే…

ఈ ఏడాది జనవరిలో  కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి సమీపంలోని ఓ పొలంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. పత్తి పొలంలో.. పత్తి తీస్తున్న షేక్ హయద్ బీ అనే మహిళకు చిన్న కవర్ కనిపించింది. అందులో ఏముందోనని తెరచి చూడగా.. ఊహించని విధంగా బాంబు పేలింది. ఈ ఘటనలో మహిళ నాలుగు వేళ్లూ తెగిపోయాయి. అదే పొలంలో మరో బాంబును పోలీసులు గుర్తించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..
బొత్స కంట రాలిన కన్నీరు.. భావోద్వేగానికి కారణం ఇదే..