Andhra Pradesh: రోహిణి కార్తె వచ్చింది బీ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు.. ఈ విపత్కర పరిస్థితుల మధ్య గురువారం నుంచి రోహిణి కార్తె ప్రారంభమయ్యింది. రోహిణి కార్తె జూన్ 7వ తేది వరకూ కొనసాగనుంది. అయితే, రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయన్న నానుడి ఉన్న విషయం తెలిసిందే.

Andhra Pradesh: రోహిణి కార్తె వచ్చింది బీ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం..
Heatwave Alert In Ap
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 26, 2023 | 7:33 AM

ఓ వైపు ఎండలు.. మరోవైపు వర్షాలు.. ఈ విపత్కర పరిస్థితుల మధ్య గురువారం నుంచి రోహిణి కార్తె ప్రారంభమయ్యింది. రోహిణి కార్తె జూన్ 7వ తేది వరకూ కొనసాగనుంది. అయితే, రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయన్న నానుడి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్ర ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం 84 మండలాల్లో వడగాల్పులు, ఎల్లుండి 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని.. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. ప్రయాణాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని.. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.

నేడు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు..

అనకాపల్లి 1, బాపట్ల 6, తూర్పుగోదావరి 5, ఏలూరు 4, గుంటూరు 17 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. కాకినాడ 11, కోనసీమ 1, కృష్ణా 13, ఎన్టీఆర్ 15, పల్నాడు జిల్లాలోని 11 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ఈరోజు అల్లూరి , కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 46°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 38°C – 40°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.

నిన్న కృష్ణా జిల్లా నందివాడలో, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 44.5°Cలు నమోదయ్యాయి. తిరుపతి జిల్లా గూడూరులో 44.4°Cలు, ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 44.3°Cలు నమోదైనట్లు డా.బి.ఆర్ అంబేద్కర్ ప్రకటనలో తెలిపారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?