AP News: తనిఖీల్లో భాగంగా లాజిస్టిక్స్ వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా

ఆదివారం ఉదయం.... 65వ నంబర్ జాతీయ రహదారి..... కంచికచర్ల మండలం పేరకలపాడు అడ్డరోడ్డు వద్ద ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ నెంబర్ 5 ఇంచార్జ్ కె. బాలశంకర్ రావు ఉదయం ఏడు గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీవీసీ లాజిస్టిక్స్ వాహనాన్ని ఆపారు.

AP News: తనిఖీల్లో భాగంగా లాజిస్టిక్స్ వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా
Vehicle
Follow us

|

Updated on: Apr 28, 2024 | 9:57 PM

ఎన్నికల అధికారుల తనిఖీల్లో డబ్బులు, మద్యంతోపాటు బంగారం కూడా భారీగా పట్టుబడుతోంది. తాజాగా.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ త‌నిఖీల్లో బంగారం భారీగా పట్టుబడింది. కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామ పరిధిలోని 65వ జాతీయ రహదారిపై ఎన్నికల అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీవీసీ లాజిస్టిక్స్ వాహనాన్ని తనిఖీ చేయగా బంగారు, వెండి ఆభరణాలు భారీగా బయటపడ్డాయి. సుమారు 14 కోట్లు విలువైన 66 కేజీల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక.. బీవీసీ లాజిస్టిక్ వాహనంలో విజయవాడలోని పలు ప్రముఖ బంగారం దుకాణాలకు అందజేసేందుకు తీసుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న ఇన్కమ్ టాక్స్, జీఎస్టీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని బంగారు, వెండి ఆభరణాలను పరిశీలించి.. దర్యాప్తు చేపట్టారు.

కాగా బంగారం వ్యాపారులు, ఇతర ఎవరైనా సరే.. పెద్ద మొత్తంలో డబ్బు లేదా బంగారు ఆభరణాలు క్యారీ చేస్తుంటే.. సంబంధిత డాక్యూమెంట్స్ పక్కనే ఉంచుకోండి. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో తనిఖీలు విసృతంగా జరుగుతున్నాయి. మీ సొత్తు ఏమైనా పోలీసులకు దొరికితే.. అది తిరిగి తెచ్చుకోడానికి తల ప్రాణం తోకకు వస్తుంది. సో.. బీ అలెర్ట్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..