పాతికేళ్ల కింద ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే.. ఎలా తిరిగొచ్చాడో తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్

అతను పాతికేళ్ల తర్వాత ఇళ్లు చేరుకున్నాడు. అనాధగా ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకు వచ్చి సంబరాలు.. ఎక్కడంటే.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మరి లేట్ ఎందుకు ఓ లుక్కేయండి

పాతికేళ్ల కింద ఇంటి నుంచి పారిపోయాడు.. కట్ చేస్తే.. ఎలా తిరిగొచ్చాడో తెలిస్తే కళ్లు చెమ్మగిల్లుతాయ్
Telugu News
Follow us
B Ravi Kumar

| Edited By: Ravi Kiran

Updated on: Jan 03, 2025 | 1:54 PM

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పాతికేళ్ల కిందట మతిస్థిమితం లేక ఇంటి నుండి తప్పిపోయిన అతను తిరిగి 60 ఏళ్ల వయస్సులో కుటుంబ సభ్యులను కలుసుకున్నాడు. తమిళనాడుకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ వల్ల సొంత కుటుంబీకులను సొంత వారి చెంతకు అతను చేసుకోగలిగారు. నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని చెన్నైలోని ఉదవుం కరంగళ్ స్వచ్ఛంద సంస్థ అందరికీ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేసింది. రెడ్ హిల్స్‌లో చిరిగిన దుస్తులతో ఆకలితో అల మటిస్తున్న ఓ వృద్ధుడ్ని సంస్థ ప్రతినిధులు చూశారు. తనలో తాను మాట్లాడుకుంటున్న ఆయన్ను ఉదవుం కరంగళకు తీసుకెళ్లారు. అనంతరం తిరువేర్కాడులోని శాంతివనంలో చేర్చారు. సంస్థ ప్రతినిధి శ్రీనివాసరావు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తన పేరు పేకేటి పెద్దిరాజు అన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం యలమంచిలిలంక అనే గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. గూగుల్ మ్యాపు ద్వారా సమీప గ్రామంలోని దుకాణం ఫోన్ నెంబర్ గుర్తించి కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాత ఆయన తల్లి వాట్సాప్లో ఉన్న కొడుకు ఫొటో చూసి నిర్ధా రణ చేసింది. ఆయన కుమారులు గంగా సురేష్, రమేష్ బాబు ఉదవుం కరంగళు చేరుకున్నారు. కొంతకాలంగా మానసిక అస్వస్థతకు గురైన పెద్దిరాజు గ్రామంలో సంచరిస్తూ పాతికేళ్ల కిందటి నుంచి కనపించకుండా పోయారు. తమ తండ్రిని అప్పగించిన ఉదవుం కరంగళ్ సంస్థ వ్యవస్థాపకుడు విద్యాకర్ కి కుమారులు కృతజ్ఞతలు తెలిపారు. 25 సంవత్సరముల తర్వాత తమ తండ్రి తమ ఇంటికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉందని తమకు నూతన సంవత్సరంలో తమ తండ్రి దొరకడం తమకు నిజమైన పండుగ అని అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..గుర్తుపట్టారా?
శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..గుర్తుపట్టారా?
రూ.5 లక్షల పెట్టుబడి ద్వారా రూ. 15 లక్షల సంపాదన.. సువర్ణావకాశం!
రూ.5 లక్షల పెట్టుబడి ద్వారా రూ. 15 లక్షల సంపాదన.. సువర్ణావకాశం!
అరటి, బొప్పాయిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
అరటి, బొప్పాయిని కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ఇదిగో..
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ఇదిగో..
ఒక్క టీ ట్రీ ఆయిల్‌ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చా..
ఒక్క టీ ట్రీ ఆయిల్‌ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చా..
నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్‌రెడ్డి
లోయర్‌ బెర్త్‌ కోసం టికెట్‌ బుక్‌ చేస్తున్నారా? రైల్వే నిబంధనలు!
లోయర్‌ బెర్త్‌ కోసం టికెట్‌ బుక్‌ చేస్తున్నారా? రైల్వే నిబంధనలు!
వరుస పరాజయాలతో గంభీర్ ఆగమాగం.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఎఫెక్ట్
వరుస పరాజయాలతో గంభీర్ ఆగమాగం.. ఛాంపియన్స్ ట్రోఫీపై ఎఫెక్ట్
తస్సాదియ్యా.. ఆ చిన్నారి ఈ అమ్మాయా..? అందాల అరాచకమే..
తస్సాదియ్యా.. ఆ చిన్నారి ఈ అమ్మాయా..? అందాల అరాచకమే..
నాలుకతో 57 తిరిగే ఫ్యాన్స్‌ని ఆపి రికార్డ్ సాధించిన వ్యక్తి..
నాలుకతో 57 తిరిగే ఫ్యాన్స్‌ని ఆపి రికార్డ్ సాధించిన వ్యక్తి..