AP News: ఆ మహిళకు విపరీతమైన కడుపు నొప్పి.. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వామ్మో…

వామ్మో.. 10... 20 కాదు ఏకంగా 570 రాళ్లు. ఎన్నో ఏళ్లుగా కడుపునొప్పి సమస్యతో సతమతమవుతున్న మహిళకు విముక్తి కల్పించారు అమలాపురం డాక్టర్లు. అయితే ఆమె పొట్టలో అన్ని రాళ్లు ఉండటంతో వాళ్లే ఆశ్చర్యపోయారు. ఇది చాలా అరుదైన కేసు అని చెప్పారు. వివరాలు తెలుసుకుందాం పదండి...

Follow us
Pvv Satyanarayana

| Edited By: Ram Naramaneni

Updated on: May 20, 2024 | 11:46 AM

ఆ మహిళ పొట్ట నిండా రాళ్లే.. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 570 రాళ్లు ఉన్నాయి. సర్జరీ చేసి వాటిని రిమూవ్ చేశారు డాక్టర్లు. వివరాల్లోకి వెళ్తే… అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఒక మహిళ కడుపులో 570 రాళ్ళను  అరుదైన చికిత్స చేసి తొలగించారు వైద్యులు. అల్లవరం మండలం దేవగుప్తంకు చెందిన జాలెం నరసవేణి అనే 31 సంవత్సరాల మహిళ గత కొంతకాలంగా విపరీతమైన కడుపునొప్పితో బాధ పడుతుంది. ఏదో పెయిన్ కిల్లర్స్ మింగుతూ నెట్టుకొచ్చేస్తుంది. తాజాగా నొప్పి తీవ్రం అవ్వడంతో…  అమలాపురంలోని ASA ఆసుపత్రిలో చేరింది. ఆమె గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మహిళ తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో అత్యవసరంగా సర్జరీ చేశారు. మహిళ కడుపులో ఏకంగా 570 రాళ్లు ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే వాటన్నింటిని తొలగించారు. ఇన్ని వందల సంఖ్యలో కడుపులో రాళ్లు ఉండటం చాలా అరుదు అంటున్నారు వైద్యులు. సాధారణంగా రాళ్లు ఎక్కువ ఉంటే పదుల సంఖ్యలో వుంటాయని ఇలా ఏకంగా వందల సంఖ్యలో రాళ్ళు ఉండటంపై వైద్యులే ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే సరైన సమయంలో మహిళకు ఆపరేషన్ చేయడం వల్ల ఏలాంటి ప్రాణాపాయం లేదంటున్నారు వైద్యులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…