Andhra Pradesh: ఏపీలోని ఆ ప్రాంతంలో రూ.5 కే కడుపునిండా భోజనం.. క్వాలిటీ కూడా నెక్ట్స్ లెవల్

సాధారణంగా ఒక ప్లేట్ భోజనం తినాలంటే ఎంత ఉంటుంది.. 60 నుంచి 100 రూపాయల మధ్య ఉంటుంది. కానీ ఏపీలోని ఆ ప్రాంతంలో మాత్రం 5రూపాయలకే భోజనం లభిస్తోంది.

Andhra Pradesh: ఏపీలోని ఆ ప్రాంతంలో  రూ.5 కే కడుపునిండా భోజనం.. క్వాలిటీ కూడా నెక్ట్స్ లెవల్
Rs 5 Meal
Follow us

|

Updated on: Jan 20, 2022 | 9:05 PM

సాధారణంగా ఒక ప్లేట్ భోజనం తినాలంటే ఎంత ఉంటుంది.. 60 నుంచి 100 రూపాయల మధ్య ఉంటుంది. కానీ అనంతపురంలో మాత్రం 5రూపాయలకే భోజనం లభిస్తోంది. మీరు నమ్మలేకపోతున్నారా.. అయితే అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని స్పందన క్యాంటీన్ కి వెళ్తే మీరు 5రూపాయలకే భోజనం తినవచ్చు. ఇదేదో 5రూపాయలే కదా అని ఎలా పడితే అలా ఉండదు.. మంచి నాణ్యమైన భోజనం రెండు మూడు ఐటమ్స్ తో ఉంటుంది. ఇంతకీ దీనిని నెలకొల్పింది ఎవరంటే.. స్పందన ఆర్గనైజేషన్.. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న స్పందన ఆర్గనైజేషన్… అనంతపురం జిల్లాలో కొంత స్థలంలో వ్యవసాయం చేస్తోంది. అక్కడ వరి, ఇతర కూరగాయలు పండిస్తున్నారు. వీటన్నటి ద్వారా ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలని భావించారు. ఇందులో భాగంగా తొలిసారిగా అనంతపురంలోని బస్టాండ్ పక్కన చంద్ర హాస్పిటల్ వద్ద క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి చేతుల మీదుగా క్యాంటీన్ ప్రారంభమైంది. ఈసందర్భంగా ఎమ్మెల్యే క్యాంటీన్ లో ఏర్పాటు చేసిన భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా భోజనం వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ గత కొద్దికాలంగా నగరంలో స్పందన సేవా సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. స్పందన క్యాంటీన్ ద్వారా అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించడం ఒక మంచి ఆలోచన అని, ప్రతి ఒక్కరూ సేవా భావనతో ఉండాలన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్ వద్ద క్యాంటీన్ ను ఏర్పాటు చేశామని.. త్వరలో ఓల్డ్ టౌన్ మార్కెట్, బళ్లారి రోడ్డు వంటి ప్రాంతాలలో ప్రారంభించనున్నట్లు స్పందన ఆర్గనైజేషన్ ప్రతినిధులు తెలిపారు.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పెన్షనర్లకు గుడ్‌ న్యూస్.. డీఏ ఉత్తర్వులు జారీ.. ఇవిగో పూర్తి వివరాలు

 ఏపీలో ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి.. భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు.. ఆ 2 జిల్లాల్లో కల్లోలం