Illegal Immigrants :ఆంధ్రప్రదేశ్ లో అక్రమంగా సంచరిస్తున్న బంగ్లాదేశీ యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
Illegal Immigrants : దర్బంగా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఓ ముఠాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ లో సంచరిస్తున్న..
Illegal Immigrants : దర్బంగా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఓ ముఠాను ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. రాజమండ్రి, విజయవాడ లో సంచరిస్తున్న మొత్తం నలుగురు యువకులను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ యువకులను విచారిస్తున్నారు. బంగ్లాదేశీయులు అక్రమ చొరబాటుపై పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. ఈ యువకులు తుల్లానా జిల్లా నుండి భారత్ లోకి ప్రవేశించారు. అంతేకాదు ఈ యువకులు పాస్ పోర్ట్ లేకుండా నల్లాల ద్వారా భారత్ లోకి ప్రవేశించినట్టు గుర్తించారు. అంతేకాదు ఈ యువకులు ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల విచారణలో తాము ఉపాది కోసం భారత్ లోకి అక్రమంగా వచ్చినట్లు పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో వెల్లడించారు. అంతేకాదు ఈ నలుగురు యువకులతో పాటు మరికొందరు బంగ్లాదేశీయులు భారత్ కి ప్రవేశించినట్లుగా నిర్దారణ చేసుకున్నారు. మరికొందరు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అక్రమంగా చొరబడి నివాసం నివాసాలు ఏర్పాటు చేస్తుకునట్టు గుర్తించారు. నిందితుల నుండి నకిలీ పాన్, ఆధార్ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు కోర్టు లో ప్రవేశ పెట్టనున్నారు.
Also Read: పదవ తరగతి ఉత్తీర్ణత అయిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ లో ఉద్యోగావకాశాలు