AP News: యూట్యూబర్లను జైలుకు పంపిన ఉడుము..! అలా చేస్తే ఇక అంతే సంగతులు..
అల్లూరు జిల్లా అరకు ఏజెన్సీలోని అనంతగిరి మండలం లక్ష్మీపురంలో అప్పలరాజు, సింహాద్రి అనే ఇద్దరు యువకులు స్నేహితులు. వారికి ఓ బాలుడు కూడా తోడయ్యాడు. సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేయడం హాబీగా పెట్టుకున్నారు. కొన్ని రీల్స్, వీడియోలు చేసి పోస్ట్ చేశారు. కామెంట్లు, షేర్లు పెరగడంతో.. ఇక ఏకంగా యూట్యూబ్ ఛానల్‌ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ' అరకు ఏజెన్సీ ఏ టు జెడ్ ' పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసుకున్నారు.
ఓ ముగ్గురు స్నేహితులు.. ఏజెన్సీలో నివాసం.. యూట్యూబర్లుగా మారారు. ఇక.. ఓ యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసి.. మన్యంలోని వింతలు, విశేషాలను జనాలకి చూపించే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఆహారం, వేటాడే విధానాన్ని కూడా వివరించి చెప్పేలా వీడియోలు పెడుతున్నారు. గిరిజన సాంప్రదాయం, ఆచారాలు, ఆహారం.. ఇలా వేరు వేరు రకాల వీడియోలు చేస్తుండటంతో క్రమంగా ఆ ఛానల్‌కు క్రేజ్ పెరుగుతోంది. అదే ఉత్సాహంతో మరో ముందడుగు వేసి.. ఉడుము మాంసం తింటే కలిగే ప్రయోజనాలను చెప్పేందుకు.. ప్రయత్నించారు.. ఇక చెప్పేదేముంది…?! సీన్ రివర్సయ్యింది.
– అల్లూరు జిల్లా అరకు ఏజెన్సీలోని అనంతగిరి మండలం లక్ష్మీపురంలో అప్పలరాజు, సింహాద్రి అనే ఇద్దరు యువకులు స్నేహితులు. వారికి ఓ బాలుడు కూడా తోడయ్యాడు. సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేయడం హాబీగా పెట్టుకున్నారు. కొన్ని రీల్స్, వీడియోలు చేసి పోస్ట్ చేశారు. కామెంట్లు, షేర్లు పెరగడంతో.. ఇక ఏకంగా యూట్యూబ్ ఛానల్‌ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ‘ అరకు ఏజెన్సీ ఏ టు జెడ్ ‘ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసుకున్నారు. అరకు ఏజెన్సీలోని గిరిజనులు, సాంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, పండుగలతో పాటు.. ఆహారం వంటి వాటిపై దృష్టి సారించి వీడియోలు చేయడం మొదలుపెట్టారు. ఇలా క్రమంగా సబ్‌స్క్రైబర్స్ పెంచుకున్నారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. అదే కొంపముంచింది…
గిరిజనుల ఆహారం వేట.. చూపించే క్రమంలో వన్యప్రాణులను వేటాడి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఉడుమును వేటాడి వండి తిన్న వీడియో పోస్ట్ చేశారు. ఉడుము మాంసం తినేలా ప్రోత్సహించే వీడియోలు అప్లోడ్ చేశారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… విషయం అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్ళింది. వన్యపాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అటవీశాఖ అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. అప్పలరాజు, సింహాద్రి సహా యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసారు. 1972 సెక్షన్ 9 ప్రకారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
పులులు నెమలిల సరసనే ఉడుములు కూడా..
ఉడుములు కూడా పులులు, నెమళ్లలా షెడ్యూల్ వన్ కేటగిరీలోకి చేరాయని అంటున్నారు అనంతగిరి ఫారెస్ట్ రేంజర్ దుర్గాప్రసాద్. ఇటీవల కాలంలో అరుదైన వన్యప్రాణులు అంతరించిపోతుండడం, వన్యప్రాణుల వేట పెరిగిపోతున్న నేపథ్యంలో గత ఏడాది అటవీ చట్టాలు మరింత కఠినతరం చేశారు. ఎవరైనా వన్యప్రాణులను వేటాడిన, ప్రోత్సహించినా జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ కోసం అలవాటులో చేసిన పొరపాటు.. ముగ్గురు యూట్యూబర్స్‌ను ఇప్పుడు ఇరకాటంలో పడేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..