AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అయ్యో దేవుడా.. భార్య మీద కోపంతో రాక్షసుడిగా మారిన భర్త.. చిన్నారిని దారుణంగా..

భార్యాభర్తల మనస్ఫర్థలకు పసిబిడ్డ బలయ్యింది. కన్నబిడ్డను అత్యంత దారుణంగా బండకేసి బాదడంతో పసిబిడ్డ మృత్యువాత పడిన ఘటన స్థానికంగా కల్లోలం రేపుతోంది.

Andhra Pradesh: అయ్యో దేవుడా.. భార్య మీద కోపంతో రాక్షసుడిగా మారిన భర్త.. చిన్నారిని దారుణంగా..
Child
Shaik Madar Saheb
|

Updated on: Nov 26, 2022 | 9:27 AM

Share

Srikalahasti: భార్యాభర్తల మనస్ఫర్థలకు పసిబిడ్డ బలయ్యింది. కన్నబిడ్డను అత్యంత దారుణంగా బండకేసి బాదడంతో పసిబిడ్డ మృత్యువాత పడిన ఘటన స్థానికంగా కల్లోలం రేపుతోంది. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. ఏం శుస్తి చేసిందో ఏమో…పసిబిడ్డ ఆపకుండా గుక్కపెట్టి ఏడుస్తోంటే పిల్లని ఆసుపత్రికి తీసుకెళ్ళాల్సింది పోయి భార్యాభర్తలిద్దరూ ఘర్షణకు దిగారు. ఆసుపత్రికి తీసుకెళ్ళే విషయంలో భార్యాభర్తలు స్వాతి, మునిరాజాల మధ్య గొడవ చినికి చినికి గాలివానగా మారింది. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు భర్త బైక్ అందుబాటులో లేకపోవడంతో మామ బైక్ పై వెళ్లేందుకు కోడలు నిరాకరించింది స్వాతి.. అదే బైక్ పై భర్త మునిరాజాతో పాపను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కూడా కోడలు స్వాతి ఇష్టపడలేదు. దీంతో తండ్రి మునిరాజా కర్కోటకుడిలా మారాడు. పసిబిడ్డను బండకేసి కొట్టాడు. పాపాయిని ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే మూడు నెలల చిన్నారి మృతిచెందింది. శుకబ్రహ్మా ఆశ్రమం వద్ద ఉన్న వాటర్ హౌస్ కాలనీలో జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

శ్రీకాళహస్తి వాటర్ హౌస్ కాలనీకి చెందిన మునిరాజా, స్వాతి దంపతులకు మూడు నెలల పాప ఉంది. బిడ్డ అనారోగ్యంతో ఏడుస్తుండటంతో.. ఆసుపత్రికి తీసుకెళ్లే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అయితే, చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు భర్త బైక్ అందుబాటులో లేకపోవడంతో.. మునిరాజా.. తండ్రి బైక్ తీసుకువచ్చాడు. మామ బైక్ పై వెళ్లేందుకు కోడలు స్వాతీ అంగీకరించలేదు.. గత కొంతకాలం నుంచి మనస్పర్ధలతో మామ, కోడలు.. మాట్లాడుకోవడం లేదు. ఆ బైక్ పై పాపను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు స్వాతి ఇష్టపడకపోవడంతో.. క్షణికావేశంలో మూడు నెలల చిన్నారిని తండ్రి మునిరాజా బండకేసి కొట్టాడు. దీంతో ఆసుపత్రికి తరలించే లోపు చిన్నారి మృతి చెందింది.

కాగా, కూతురిని చంపిన తండ్రి మునిరాజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తలకు తీవ్ర గాయం కావడంతోనే 3 నెలల చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య తగాదానే చిన్నారి ప్రాణాలను బలి తీసుకుందని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..