Konaseema: అట్టుడుకుతున్న కోనసీమ..144 సెక్షన్ అమలు! వాటిపై నిషేధాంక్షలు..
కోనసీమ అట్టుడుకుంతోంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతోపాటు కొత్తపేట, కాట్రేనికొన, రావులపాలెం మండలాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎలాంటి
కోనసీమ అట్టుడుకుంతోంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అమలాపురం, పి గన్నవరం నియోజకవర్గాలతోపాటు కొత్తపేట, కాట్రేనికొన, రావులపాలెం మండలాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఎలాంటి ర్యాలీలు, నిరసనలు, బహిరంగసభలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ప్రకటించారు. కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చారు. జిల్లా పేరును మార్చొద్దని ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అమలాపురంలో నలుగురు డీఎస్పీలతో పాటు 450 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు అమలాపురం కలెక్టరేట్ ఇవాళ నిర్వహించే స్పందన, DDRC కార్యక్రమాలకు భారీగా భద్రత పెంచారు.
కాగా, అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మారుస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వం ప్రకటించింది.. కానీ, ఇదే ఇప్పుడు జగన్ సర్కార్‌కు కొత్త తలనొప్పిగా మారింది.. గతంలో పేరు మార్చాలంటూ ఆందోళనలు సాగిన విషయం తెలిసిందే, కాగా.. ఇప్పుడు పేరు మార్చొద్దంటూ నిరసనలకు దిగుతున్నారు.. ఈ నేపథ్యంలో.. 144 సెక్షన్ విధించారు పోలీసులు.
ఇదిలా ఉంటే, అంబేద్కర్ కోనసీమ జిల్లా చిరునామాతో ఇటీవలే తొలి శుభలేఖ వెలువడింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన అంబేద్కర్ వాదులు..కోనసీమ జిల్లాకు అంబెడ్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టకముందే తన పెళ్ళి శుభలేఖ చిరునామాలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ముద్రించుకున్నాడు నాని అనే యువకుడు. అయినవిల్లి మండలం విరవల్లిపాలెంకు చెందిన నాని వివాహం ఈనెల 26వ తేదీన జరగనుంది. పెళ్ళికి 15రోజుల క్రితం తన పెళ్ళి శుభలేఖలో అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ముద్రించుకుని బంధువులు,స్నేహితులకు కార్డ్స్ పంచిపెట్టారు. అయితే, ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం కోనసీమ జిల్లాగా ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు వరుడు నాని. ప్రభుత్వం అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ప్రకటించడంపై సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు పెళ్ళికొడుకు నాని.