AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Botsa Satyanarayana: పర్మినెంట్ అడ్రస్ లేని వ్యక్తి చంద్రబాబు.. మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు..

మొదటిరోజే మృతుడి తల్లి, భార్య స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటే.. ఈపాటికి ఎమ్మెల్సీ అరెస్ట్ అయ్యేవారని మంత్రి బొత్సా సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. చట్టానికి చుట్టాలు ఉండరని.. న్యాయం ప్రకారం చర్యలు ఉంటాయని బొత్స పేర్కొన్నారు.

Botsa Satyanarayana: పర్మినెంట్ అడ్రస్ లేని వ్యక్తి చంద్రబాబు.. మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు..
Botsa Satyanarayana
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 23, 2022 | 11:25 AM

Minister Botsa Comments on chandrababu: చట్టానికి ఎవరూ చుట్టాలు కాదని.. సుబ్రహ్మణ్యం కేసులో విచారణ జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఏమ్మేల్సీపై కేసు నమోదు చేశామని.. త్వరలో అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఏమ్మేల్సి అనంత బాబు పెళ్లికి వెల్లోచ్చారని మీడియాలో చూశానని.. తప్పుచేయలేదనే సెల్ప్ కాన్పిడేన్స్ తో తిరిగి ఉండవచ్చని బొత్సా పేర్కొన్నారు. మొదటిరోజే మృతుడి తల్లి, భార్య స్టేట్‌మెంట్ ఇచ్చి ఉంటే.. ఈపాటికి ఎమ్మెల్సీ అరెస్ట్ అయ్యేవారని బొత్సా అభిప్రాయపడ్డారు. రెండు రోజులపాటు మృతుడి కుటుంబసభ్యులు సమయం వ‌ృధా చేశారని.. ఈ ప్రభుత్వంలో ఏవరూ చట్టానికి చుట్టాలు ఉండరని.. న్యాయం ప్రకారం చర్యలు ఉంటాయని బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బొత్సా శ్రీకాకుళంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి బోత్సా సత్యనారాయణ చంద్రబాబు, లోకేష్‌లపై మండి పడ్డారు. లోకేష్‌కి తెలిసింది తక్కువ.. మాట్లాడేది తక్కువ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మాటలు చెప్తున్నాడు కానీ ఆ అబ్బాయికి ఏమి తెలీయదన్నారు. మగ్గు, సుత్తి, కొడవలి ఇస్తే… బీసీలను అక్కున చేర్చుకున్నట్లా..? అని ప్రశ్నించారు. బీసీలకు ఇది చేశామని ఒక్కటైనా చెప్పగలరా.. అంటూ లోకేష్, చంద్రబాబును విమర్శించారు. మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు ప్రజల ముందుకు వస్తున్నారని బొత్స పేర్కొన్నారు.

కాగా.. వైసీపీ రాజ్యసభకు పేర్లు ప్రకటించడంపై వస్తున్న విమర్శలపై బొత్స స్పందించారు. రాజ్యసభ అనేది దేశం మొత్తానిదని తెలిపారు. గతంలో సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్, నత్వానీలకు ఇచ్చామని పేర్కొన్నారు. చంద్రబాబు ఆంధ్రా వారా, తెలంగాణ వారా..? అని ప్రశ్నించారు. ఏపీలో పర్మినెంట్ అడ్రస్ లేని వ్యక్తి చంద్రబాబు అంటూ పేర్కొన్నారు. తెలంగాణలో.. ఉత్తరాంధ్ర కులాల బిసి కేటగిరీ కోసం మేం ప్రయత్నించాం.. కాని పని అవ్వలేదు నా కులాన్ని సైతం బిసి కేటగిరీ నుంచి తీసివేశారని తెలిపారు. అది తెలంగాణ ముఖ్యమంత్రి నిర్ణయం, ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు. అక్కడ మా ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. పెట్రోలు ధరలపై సీతారామన్ మాటలు హాస్యాస్పదమని బొత్స పేర్కొన్నారు. 2019 – ఇప్పటి పెట్రోల్ ధరలు చూడండి.. 40శాతం పెంచి 2 శాతం తగ్గించి.. తగ్గించామనడం సరికాదని బొత్స అభిప్రాయపడ్డారు.

ఇబ్బందులకు గురిచేస్తున్నారు.. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు

ఇవి కూడా చదవండి

సుబ్రహ్మణ్యం చనిపోయిన బాధలో తాముంటే.. పోలీసులు ఇంటికొచ్చి వేధిస్తున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఎస్‌ రావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమ ఇంటి చుట్టూ తిరగకుండా ఎమ్మెల్సీ ఎక్కడ ఉన్నారో వెల్లడించాలని కోరుతున్నారు. మరోవైపు జి.మామిడాడలో పోలీస్‌ పికెట్‌పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీస్ పికెట్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..