Chandrababu Naidu Arrest: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు శనివారం నంద్యాలలో అరెస్టు చేసి.. విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. దీంతో 40 గంటలుగా ఉత్కంఠ నెలకొంది.

Chandrababu Naidu Arrest:  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్..
Chndrababu Remand
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 10, 2023 | 7:07 PM

ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. సిట్ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఈ నెల 22 వరకు అంటే 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఈ రాత్రికి బాబును సిట్ ఆఫీసుకు తీసుకెళ్లి.. సోమవారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు శనివారం నంద్యాలలో అరెస్టు చేసి.. విజయవాడ సీఐడీ కార్యాలయానికి తరలించారు. దీంతో 40 గంటలుగా ఉత్కంఠ నెలకొంది. 34 అభియోగాలను నమోదు చేసిన సీఐడీ.. చంద్రబాబును ప్రశ్నించిన అనంతరం.. సీబీఐ కోర్టులో ఆదివారం తెల్లవారుజామున ప్రవేశపెట్టింది. ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబే కుట్రకు ప్రధాన సూత్రదారి అని సీఐడీ ఏసీబీ కోర్టుకు రిమాండ్‌ రిపోర్టును సమర్పించింది. మొత్తం 28పేజీలతో కూడిన చంద్రబాబు రిమాండ్‌ రిపోర్టును సమర్పించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ జరిగిన తీరును సీఐడీ వివరించడంతోపాటు చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బు రిలీజ్‌ అయ్యిందని తెలిపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ మెమో దాఖలు చేసింది.

దీంతో స్కిల్ స్కామ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో సుధీర్ఘంగా వాదనలు కొనసాగాయి.. సుమారు 8 గంటలపాటు వాదనలు కొనసాగాయి. అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.. దాదాపు 40 గంటల ఉత్కంఠకు ఆదివారం సాయంత్రం తెరపడింది. చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పును వెలువరించింది.

అయితే తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరఫున సిద్థార్థ లూత్రా, పోసాని వెంకటేశ్వర్లు తమ వాదనలు వినిపించారు. ముఖ్యంగా సీఐడీ రిమాండ్‌ రిపోర్టులో పెట్టిన సెక్షన్ 409పై బలంగా వాదనలు వినిపించారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఈ సెక్షన్ వర్తించదని స్పష్టం చేశారు. సీఐడీ తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. రిమాండ్ రిపోర్ట్‌లో చంద్రబాబుపై సంచలన అభియోగాలు చేసింది సీఐడీ. స్కిల్‌ స్కాంలో చంద్రబాబే కీలక సూత్రధారి అని.. ఈ స్కాంపై చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందన్నారు. చంద్రబాబు ఆదేశాలతోనే డబ్బులు రిలీజ్ అయ్యాయని రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలు చూపుతూ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటున్నారు తప్ప.. తప్పు జరగలేదని, నిధుల గోల్‌మాల్ జరగలేదని చంద్రబాబు, ఆయన తరుపున లాయర్లు చెప్పడం లేదని వాదించారు.

వాదనలను పూర్తిగా విన్న అనంతరం.. ధర్మాసనం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి రిమాండ్ విధించింది. కాగా.. వాదనల అనంతరం ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కాగా.. కోర్టు ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..