Chandrababu Naidu: చేసిన నేరానికి తలదించుకోవాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు రిమాండ్‌పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ రూపకర్త, నిర్మాత, దర్శకత్వం, హీరో, విలన్, లబ్దిదారు అంతా చంద్రబాబేనని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బలమైన సాక్ష్యాధారాలు ఉండటంతోనే ఆయనను సీఐడీ అరెస్టు చేసిందని తెలిపారు. కేసు కచ్చితంగా లాజికల్ ఎండ్‌కు వెళ్తుందని సజ్జల స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ స్కాం వ్యూహకర్త, నిర్మాత, దర్శకుడు చంద్రబాబు అని అన్నారు. స్కాంకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయన్నారు. బలమైన సాక్ష్యాలతో చంద్రబాబును అరెస్ట్ చేశారని.. చేసిన నేరానికి తలదించుకోవాల్సింది పోయి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తరఫున దత్త పుత్రుడు హంగామా చేశారని ఎద్దేవ చేశారు. ఈ కేసు ఖచ్చితంగా లాజికల్ ఎండ్‌కు వెళ్తుందని సజ్జల స్పష్టం చేశారు.
ఇదిలావుంటే, చంద్రబాబు జీవితాంతం చిప్పకూడు తింటారని చెప్పారు వైసీపీ మంత్రి రోజా. చంద్రబాబుకు మద్దతుగా ఉన్న నేతలంతా జైలుకెళ్లే రోజు వస్తుందని జోస్యం చెప్పారామె. స్కిల్ స్కామ్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్ట్ చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగానే ఆమె తన అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచారు. బాణాసంచా కాల్చారు.
తప్పు చేస్తే సామాన్యుడికి ఏ శిక్ష పడుతుందో అదే శిక్ష చంద్రబాబుకు ఉండాలని పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. ఆయనేం చట్టాలకు ఆతీతం కాదని తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేస్తే ఎక్కడా సింపతీ రాలేదని అన్నారు. ఇన్నాళ్లు వ్యవస్థలను చంద్రబాబు మ్యానేజ్ చేస్తూ వచ్చారని, ఇక ఉండదని రోజా తెలిపారు. చంద్రబాబుకు రిమాండ్ విధించడాన్ని స్వాగతిస్తున్నానని అన్నారు.
మరోవైపు, జగన్ అవినీతికి పాల్పడ్డాడని , రెడ్ డైరీలో వివరాలు ఉన్నాయంటున్న లోకేశ్ ఇప్పుడు తన తండ్రి అవినీతి గురించి ఆ డైరీలో రాసుకోవాలన్నారు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు అవినీతిని బయటపెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించిన ఘనత సీఎం జగన్‌దే అన్నారు. చంద్రబాబుకు లోకేశ్ ఉత్తపుత్రుడని , పవన్ దత్తపుత్రుడని మరోసారి నిరూపితమయ్యిందన్నారు. ప్యాకేజీ తీసుకొని , అర్ధరాత్రి వచ్చి పవన్‌కళ్యాణ్ హడావుడి చేశారని విమర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం